News July 7, 2025

NGKL: విద్యుత్ శాఖ ఇన్‌ఛార్జ్ SEగా నరసింహారెడ్డి

image

నాగర్‌కర్నూల్ జిల్లా విద్యుత్ ఇన్‌ఛార్జ్ SEగా నరసింహారెడ్డిని నియమిస్తూ సీఎండీ ముష్రఫ్ ఫారుకి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నరసింహారెడ్డి ప్రస్తుతం మేడ్చల్ డీఈగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు అదనంగా ఎస్‌ఈ బాధ్యతలను అప్పగించారు. ఉమ్మడి జిల్లాలో కల్వకుర్తి, జడ్చర్ల ప్రాంతాలలో ఆయన ఏడీఈ, డీఈగా నిర్వహించారు. మరోసారి జిల్లాకు రావడం పట్ల విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News July 8, 2025

MHBD: అమ్మాయిలూ.. ఆకతాయిలు ఏడిపిస్తున్నారా?

image

జామండ్లపల్లి జడ్పీహెచ్ఎస్‌లో షీ టీం SI సునంద ఆధ్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంట, బయట ఎక్కడైనా ఆకతాయిలు బాలికలను, యువతులను భయాందోళనకు గురిచేస్తే తమకు ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు. 8712656935కు సమాచారం అందించాలని పేర్కొన్నారు. MHBD ఎస్పీ రామ్‌నాధ్ కేకన్ ఆదేశాల మేరకు ఈ సదస్సు నిర్వహించామన్నారు.

News July 8, 2025

కర్రెగుట్టలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చి దిద్దుతాం: సీతక్క

image

వెంకటాపురం మండలంలోని కర్రెగుట్టలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్న ఈ గుట్టలు ఎన్నో జలపాతాలకు, అటవీ సంపదకు, వన్యప్రాణులకు నిలయంగా ఉన్నాయని అన్నారు. ఈ ప్రాంతం పర్యాటక రంగంగా అభివృద్ధి చెందితే వెంకటాపురం, వాజేడు ప్రాంతాలు పర్యాటక హబ్‌గా మారుతాయన్నారు.

News July 8, 2025

బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సు సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామన్నారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.