News July 4, 2024
NGKL: విద్యుదాఘాతంతో బాలుడు మృతి

విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందిన విషాద ఘటన రాజాపూర్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. రేకులపల్లి గ్రామ పరిధిలోని ఒప్పితండాకు చెందిన శివ(15) గ్రామపంచాయితీలో విద్యుత్ బల్బును అమర్చుతున్నాడు. పక్కనే ఉన్న 11కేజీ వోల్టేజ్ విద్యుత్ తీగ తెగి బాలుడిపై పడడంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.
Similar News
News February 28, 2026
MBNR: అలివేలు మంగమ్మ బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధం

మన్యంకొండ శ్రీ అలివేలు మంగతాయారు సన్నిధిలో ఆదివారం నుంచి మార్చి 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అంకురార్పణంతో వేడుకలు ప్రారంభమవుతాయని ఆలయ ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్ తెలిపారు. రేపు ధ్వజారోహణం, గరుడ వాహనసేవ, మంగళవారం విమాన రథోత్సవం. అయితే, చంద్రగ్రహణం కారణంగా ఈసారి కళ్యాణోత్సవాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. గ్రహణం రోజున ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఆలయ ద్వారబంధనం ఉంటుందన్నారు.
News February 28, 2026
MBNR: పీయూ.. ఎల్.ఎల్.బి పరీక్షలు!!

పాలమూరు విశ్వవిద్యాలయంలోని ఆకాడమిక్ భావనంలో L.L.M మొదటి సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ మేరకు పరీక్షలను పరీక్షల నియంత్రణా అధికారి డాక్టర్ కె.ప్రవీణ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె.మాళవి, న్యాయ కళాశాల హెచ్ఓడీ డాక్టర్ వి.రాధాకృష్ణ, జి.రవి, జగదీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
News February 28, 2026
మహబూబ్‌నగర్: వచ్చే నెల 4న హోలీ పండుగ

మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు హోలీ పండుగను మార్చి 4వ తేదీన నిర్వహించాలని జిల్లా బ్రాహ్మణ సంఘం తెలిపింది. జ్యోతిష్య పండితులచే చర్చించిన అనంతరం 2వ తేదీన కామ దహన కార్యక్రమం నిర్వహించాలని, 3న చంద్రగ్రహణం ఉన్నందున4వ తేదీన హోలీ వేడుకలు నిర్వహించుకోవాలని జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గోండ్యాల రాఘవేంద్ర శర్మ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు బుధవారం ఉత్సవాలు చేసుకోవాలని సూచించారు.


