News December 22, 2025

NGKL: వైరల్ లోడ్ పరీక్షల కోసం రక్త నమూనాల సేకరణ

image

జిల్లా ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో 144 మంది రోగుల నుంచి రక్త నమూనాలను సేకరించారు. ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శేఖర్ మాట్లాడుతూ.. రోగులకు ఏడాదికి ఒకసారి వైరల్ లోడ్, CD-4 కౌంట్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నివేదికల ఆధారంగానే బాధితులకు తదుపరి చికిత్స, మందులు అందిస్తామని వివరించారు. ఈ శిబిరంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రోగులు తరలివచ్చారు.

Similar News

News December 29, 2025

నేడు భద్రాచలం ఐటీడీఏలో గిరిజన దర్బార్‌

image

భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం ఉదయం 10:30 గంటలకు గిరిజన దర్బార్‌ నిర్వహించనున్నట్లు ప్రాజెక్టు అధికారి బి. రాహుల్‌ తెలిపారు. గిరిజనులు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలతో హాజరుకావాలని కోరారు. దర్బార్‌కు అన్ని శాఖల యూనిట్‌ అధికారులు సకాలంలో హాజరై ఫిర్యాదులను స్వీకరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

News December 29, 2025

విశాఖ: ప్రభుత్వ కార్యాలయలలో నేడు పీజీఆర్ఎస్

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీ జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News December 29, 2025

నేడు క్యాబినెట్ భేటీ.. జిల్లాలపై నిర్ణయం?

image

AP: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ప్రధానంగా జిల్లాల పునర్విభజనపై సీఎం సమీక్షించనున్నారు. అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మార్పులపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 3 కొత్త జిల్లాల ఏర్పాటు, పలు రెవెన్యూ డివిజన్లకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.