News December 19, 2025
NGKL: వ్యవసాయ పొలాల్లో పెద్దపులి జాడలు

కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని ఎంగంపల్లి తండా గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో పెద్దపులి పాదముద్రలు కనిపించడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి అవి పెద్దపులి జాడలేనని నిర్ధారించారు. రాత్రివేళ పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని, పులి సంచారం గమనిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Similar News
News December 19, 2025
కడప: ట్రాక్టర్ చక్రాల కిందపడి వ్యక్తి మృతి

ట్రాక్టర్‌పై నుంచి కింద పడి అదే వాహన చక్రాల కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన రాజుపాలెం మండలం వెలవలి సాయిబాబా దేవాలయం సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. నాగరాజు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఉదయం వేళ అతను కూలి పనులకు వెళ్లాడు. తిరిగి సాయంత్రం ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు.
News December 19, 2025
సంగారెడ్డి: 22న మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమం: కలెక్టర్

విపత్తుల నిర్వహణ సన్నద్ధతపై ఈనెల 22న ప్రయోగాత్మకంగా మాక్ ఎక్సర్ సైజ్ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ పారితోష్ పంకజ్‌తో కలిసి శుక్రవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సహకారంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పారు.
News December 19, 2025
ADB: PACS రద్దు చేసిన ప్రభుత్వం

PACS పాలకవర్గాలు రద్దు చేస్తూ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్ల పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలను విడుదల చేసింది. ఉత్తర్వుల ప్రకారం నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న సహకార సంఘాల పాలకమండళ్లు రద్దు కానున్నాయి.


