News February 23, 2025

NGKL: శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు.!

image

మహాశివరాత్రి సందర్భంగా అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి 28 వరకు అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి మొత్తం 58 బస్సులు నడుపుతున్నామని పేర్కొన్నారు. ప్రత్యేక బస్సు సర్వీసులను శివ స్వాములు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News December 23, 2025

క్యాబినెట్ భేటీ వాయిదా

image

AP: ఈ నెల 24న జరగాల్సిన క్యాబినెట్ భేటీ వాయిదా పడింది. 29వ తేదీకి మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేస్తూ CS విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ రోజు సీఎం అధ్యక్షతన 10.30amకు సచివాలయం మొదటి బ్లాకులో భేటీ జరగనుంది. మరోవైపు ఈ నెల 28న CM చంద్రబాబు అయోధ్య వెళ్లనున్నారు. 11.20amకు రామజన్మభూమి కాంప్లెక్స్‌కు చేరుకొని 2.30pm వరకు శ్రీరాముడిని దర్శించుకుంటారు. అనంతరం ఉండవల్లిలోని నివాసానికి తిరుగుపయనమవుతారు.

News December 23, 2025

ఊట్కూర్: ప్రజాసేవకు తొలి అడుగు.. మాతృత్వానికి శుభారంభం

image

ఊట్కూర్ నూతన సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన రోజే రేణుక భరత్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. సోమవారం ఉదయం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ఆమె, సాయంత్రం తల్లయ్యారు. ఒకే రోజు అటు నాయకత్వ బాధ్యత, ఇటు మాతృత్వపు ఆనందం పొందడం అరుదైన ఘట్టంగా నిలిచింది. ఈ వార్తతో గ్రామంలో ఆనందం వెల్లివిరియగా, ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి.

News December 23, 2025

NGKL: రైతులు ALERT.. ఫోన్ చేయండి!

image

నాగర్ కర్నూల్ జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రం పాలెంలో పలు రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు “Way2News” ప్రతినిధితో తెలిపారు. మధిర మినుము-1 (MBG-1070) రకం ఫౌండేషన్ విత్తనం. విత్తన ధర Rs.180/- కిలో, వివరాలకు 94944 31405, 99126 04549, తెలంగాణ సోనా (RNR-15048) రకం వరి ఫౌండేషన్ విత్తనం. 15 కి.లో. బస్తా ధర Rs. 1155/-. వివరాలకు: 94944 31405, 99126 04549లకు సంప్రదించాలన్నారు.