News March 15, 2025
NGKL: శ్రీశైలం హైవేపై వాహనాల రాకపోకలపై సర్వే.!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్రాబాద్ మండలం శ్రీశైలం హైవేలో 7,668 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేయనుంది. రోజుకు ఈ రోడ్డుపై సగటున 7,181 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మన్ననూరు చెక్‌పోస్ట్ వరకు 6,880, వట్వర్లపల్లి ఈగలపెంట మధ్య 7,005 వాహనాలు తిరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రోడ్డుపై శ్రీశైలానికి, ఏపీకి ఎన్ని వాహనాలు వెళుతున్నాయనే వివరాలను సేకరిస్తున్నారు.
Similar News
News March 15, 2025
బాపట్ల: ఇంటర్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన స్పెషలాఫీసర్

బాపట్ల పట్టణంలో ఇంటర్ పరీక్ష కేంద్రాలను బాపట్ల జిల్లా స్పెషల్ అధికారి కృతిక శుక్ల బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళితో కలిసి పరిశీలించారు. శనివారం ఇంటర్ పరీక్ష కేంద్రాలను పరిశీలించి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. బాపట్ల జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకార్ జైన్, తదితర అధికారులు పాల్గొన్నారు.
News March 15, 2025
గిరిజనేతర మహిళతో పెళ్లి.. మాజీ ఎంపీకి షాక్!

ఒడిశాలోని బీజేడీ నేత, మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీకి షాక్ తగిలింది. గిరిజనేతర అగ్రకుల మహిళను ఆయన పెళ్లి చేసుకోవడాన్ని నేరంగా పరిగణించిన ఆయన తెగ ‘భటారా సమాజ్’ ప్రదీప్‌ను వెలివేస్తున్నట్లు ప్రకటించింది. తమ సమావేశంలో ఆ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. తెగ నిబంధనల్ని ఆయన ఉల్లంఘించారని, అందుకే వెలివేయాల్సి వస్తోందని వివరించింది. ప్రదీప్ 2009లో కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు.
News March 15, 2025
మెదక్: రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆర్డీఓ సమావేశం

మెదక్ ఆర్డీవో రమాదేవి తన కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఫారం-6, 8ల గురించి రాజకీయ పార్టీ ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఓటరు జాబితా నిరంతర నమోదు, బూత్ స్థాయి ప్రతినిధుల నియామకం గురించి చర్చించారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలకు అధికారులు సమాధానం ఇచ్చారు. తహసీల్దార్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.