News April 5, 2025
NGKL: సన్న బియ్యం పంపిణీ పేదలకు వరం: ఎమ్మెల్యే

నాగర్ కర్నూల్ మండలం మంతటి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శనివారం స్థానిక ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం వరంలాంటిదని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణ రావు, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 12, 2025
CSK మరో చెత్త రికార్డు

ఐపీఎల్-2025లో ఇప్పటివరకు అత్యధిక డాట్ బాల్స్ (245) ఆడిన జట్టుగా CSK నిలిచింది. నిన్న KKRతో ఆడిన మ్యాచులోనే 61 డాట్ బాల్స్ ఆడటం గమనార్హం. ఈ లిస్టులో CSK తర్వాత వరుసగా KKR (245), RR (206), RCB (202), MI (198), SRH (191), LSG (186), GT (167), PBKS (145), DC (123) ఉన్నాయి. ఐపీఎల్‌లో ఒక్కో డాట్ బాల్‌కు బీసీసీఐ 500 మొక్కలను నాటుతున్న సంగతి తెలిసిందే.
News April 12, 2025
గోశాలలో ఆవుల మరణంపై YCP దుష్ప్రచారం: నారాయణ

AP: టీటీడీ గోశాలలో వందలాది ఆవులు మరణించడం అవాస్తవమని మంత్రి నారాయణ తెలిపారు. దీనిపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ‘మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల్లో అలజడి సృష్టించేందుకు వైసీపీ కుట్ర పన్నింది. తప్పుడు ప్రచారంతో టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చాలని చూసింది. ఇలాంటి కుట్రలు చేస్తుంది కాబట్టే ఆ పార్టీ పతనమైంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.
News April 12, 2025
EVMలను ట్యాంపర్ చేయడం అసాధ్యం: CEC

EVMలను హ్యాక్ చేయవచ్చన్న US జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసి గబ్బార్డ్ చేసిన వ్యాఖ్యలను CEC జ్ఞానేష్ కుమార్ ఖండించారు. ఇండియాలో వాడే EVMలు వంద శాతం సేఫ్, ట్యాంపర్ ప్రూఫ్ అని స్పష్టం చేశారు. వాటిని ఎలాంటి బ్లూటూత్ పరికరాలతో కనెక్ట్ చేయలేరని, అందుకే ట్యాంపర్ చేయడం అసాధ్యమని తేల్చి చెప్పారు. 5 కోట్ల VVPAT స్లిప్పులు లెక్కించినా.. ఎక్కడా తప్పులు దొర్లలేదని తెలిపారు.