News April 12, 2025

NGKL: సళేశ్వరం జాతరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాం: ఎస్పీ

image

సళేశ్వరం జాతరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో దక్షిణ అమర్నాథ్ యాత్రగా పేరుపొందిన సళేశ్వర జాతరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం నీటి సౌకర్యం, ఆహార వితరణ, క్యూలైన్ దర్శనం, మెడికల్ ఎమర్జెన్సీ, CC కెమెరాలు ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ గురించి సిబ్బందికి పలు సూచనలు చేశామన్నారు.

Similar News

News July 7, 2025

వికారాబాద్: మార్పు రావాలి.. రక్షణ కావాలి!

image

అనంతగిరి.. చుట్టూ అడవులు, పెద్ద సరస్సులు కలిగిన పర్యాటక ప్రాంతం. బోటింగ్, ట్రెక్కింగ్ కోసం ఇక్కడికి టూరిస్టులు తరలివస్తుంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో ఈ టూర్‌ విషాదాన్ని నింపుతోంది. 2023లో కోట్‌పల్లి ప్రాజెక్ట్‌లో ఈతకోసం దిగి ముగ్గురు యువకులు మృతి చెందగా.. ఇటీవల సర్పన్‌పల్లి ప్రాజెక్టులో ఇద్దరు మహిళలు చనిపోయారు. రక్షణ చర్యలు పటిష్టం చేస్తే ప్రాణ నష్టం జరగదని టూరిస్టుల మాట. దీనిపై మీ కామెంట్?

News July 7, 2025

చింతపల్లి: పాఠశాల పైకప్పుపై టార్పాలిన్ కవర్లు

image

చింతపల్లి మండలం చౌడురాయిలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. వర్షాలు కురిసినప్పుడు తరగతి గదులు, వరండాల్లో వాన నీటితో నిండిపోతుంది. ఇలా నీటిలోనే విద్యార్థులు విద్యను అభ్యసించడంతో తల్లిదండ్రులు పైకప్పుపై టార్పాలిన్ కవర్లను వేసి సమస్యను తాత్కాలికంగా పరిష్కరించారు. సుమారు 30 ఏళ్ల క్రితం పాఠశాల భవనం నిర్మించారని, మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.

News July 7, 2025

కాకినాడ JNTUకు కొత్త అధికారులు

image

కాకినాడ జేఎన్టీయూ ఇన్‌ఛార్జ్ రెక్టార్, రిజిస్ట్రార్‌లను నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. యూసీఈకే ఈఈఈ విభాగంలో పనిచేస్తున్న శ్రీవినాసరావు ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న సుబ్బారావు ఇన్‌ఛార్జ్ రెక్టార్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు వారిని వీసీ ప్రసాద్ అభినందించారు.