News April 15, 2025
NGKL: సళేశ్వరం జాతరకు 3 లక్షలకు పైగా భక్తులు..!

నాగర్ కర్నూల్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న సళేశ్వరం ఉత్సవాలకు మూడు రోజుల్లో దాదాపు 3 లక్షలకు పైగానే భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా వేశారు. ఈనెల 11 నుంచి 13 వరకు సళేశ్వరం ఉత్సవాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి లింగామయ్యను దర్శించుకున్నారు. నల్లమల అటవీ ప్రాంతం భక్తుల తాకిడికి దద్దరిల్లిపోయింది. వరుసగా రెండు రోజులు ట్రాఫిక్ జామ్ అయింది.
Similar News
News July 5, 2025
వైసీపీ కర్నూలు జిల్లా వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా ఉస్మాన్ సాహెబ్

వైసీపీ కర్నూలు జిల్లా వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా గోనెగండ్లకు చెందిన కార్యకర్త ఉస్మాన్ సాహెబ్‌ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ఉస్మాన్ సాహెబ్ మాట్లాడుతూ.. సామాన్య కార్యకర్త అయిన తనకు అధిష్ఠానం జిల్లా వాణిజ్య విభాగ కార్యదర్శి పదవి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇన్‌ఛార్జ్ బుట్టా రేణుక, ఎంపీపీ నస్రుద్దీన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
News July 5, 2025
అమలాపురం: విపస్యాన ధ్యాన పద్ధతిపై కలెక్టర్ సూచనలు

పని ఒత్తిడిని అధిగమించి మనశ్శాంతిని సాధించడానికి విపస్యాన ధ్యాన పద్ధతి సరైనదని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ అన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద శనివారం విపస్యాన ధ్యాన కార్యక్రమంపై ఎంఈఓలు, హెచ్ఎంలతో అవగాహన సదస్సు నిర్వహించారు. పాఠశాలలలో పిల్లలకు వయసు వారీగా విపస్యాన ధ్యాన కార్యక్రమాల నిర్వహణపై ఆయన వారికి సూచనలు చేశారు.
News July 5, 2025
KCRకు వచ్చే వారంలో మరోసారి వైద్య పరీక్షలు: బీఆర్ఎస్

TG: మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. వారం రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు డాక్టర్లు సూచించినట్లు BRS ట్వీట్ చేసింది. ‘ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, సోడియం లెవల్స్ కొద్దిగా పెరిగాయని యశోద ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. వచ్చే గురు, శుక్ర వారాల్లో వైద్య పరీక్షల నిమిత్తం మరోసారి యశోద ఆస్పత్రికి KCR వెళ్తారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు’ అని పేర్కొంది.