News February 3, 2025

NGKL: సినిమాకు డబ్బులివ్వలేదని.. ఉరేసుకున్నాడు

image

సినిమాకు వెళ్లేందుకు తండ్రి డబ్బులివ్వలేదని ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన NGKL జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సంతబజార్ కాలనీకి చెందిన గణేశ్ కుమారుడు కార్తీక్(13) సినిమాకెళ్లేందుకు తండ్రిని డబ్బులడగగా, ఆయన మందలించాడు. తల్లిదండ్రులు బయటికెళ్లగానే ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరిగొచ్చిన తల్లిదండ్రులు కుమారుడిని అలా చూసి గుండెలవిసేలా రోదించారు.

Similar News

News February 3, 2025

MBNR: చల్లా వంశీచంద్ రెడ్డికి కీలక పదవి

image

కల్వకుర్తి కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం కీలక పదవి కట్టబెట్టింది. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ లీడర్స్ అండ్ ఎక్స్‌పర్ట్స్ అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ kc వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ కమిటీని 8మంది సభ్యులతో ఏర్పాటు చేయగా తెలంగాణకు చెందిన చల్లా వంశీచంద్ రెడ్డికి చోటు దక్కింది.

News February 3, 2025

మరికల్: చిరుత సంచారం నిజమే..!

image

NRPT జిల్లా మరికల్ మండలం పూసల్ పాడ్ లో సంజీవ కొండపై <<15345332>>చిరుత<<>> సంచరిస్తున్నట్లు అటవీశాఖ బీట్ అధికారి మల్లేశ్ ధ్రువీకరించారు. గతేడాది డిసెంబర్ ఒకటో తేదీన కొండపై చిరుత సంచరించిన వీడియోలు ఉన్నాయని, గ్యాప్ తర్వాత పశువులపై దాడి చేసినట్టు ఆయన నిర్ధారించారు. చిరుత సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దానికి ఎలాంటి హాని కలిగించొద్దని రైతులను హెచ్చరించారు. చిరుత సంచారంతో ప్రజల్లో భయందోళన కలుగుతుంది.

News February 3, 2025

జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం !

image

5వ శక్తి పీఠమైన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం క్రీ.శ 7వ శతాబ్దంలో బాదామి చాళుక్యులచే నిర్మించబడింది. మొదట్లో అమ్మవారిని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పూజించేవారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 2004 ఫిబ్రవరి నెలలో జోగులాంబ అమ్మవారికి ప్రత్యేకమైన గుడి కట్టించి అందులో అమ్మ వారిని ప్రతిష్ఠించారు. 2005 నుంచి ఫిబ్రవరి నెలలో అమ్మవారి వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.