News February 3, 2025
NGKL: సినిమాకు డబ్బులివ్వలేదని.. ఉరేసుకున్నాడు

సినిమాకు వెళ్లేందుకు తండ్రి డబ్బులివ్వలేదని ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన NGKL జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సంతబజార్ కాలనీకి చెందిన గణేశ్ కుమారుడు కార్తీక్(13) సినిమాకెళ్లేందుకు తండ్రిని డబ్బులడగగా, ఆయన మందలించాడు. తల్లిదండ్రులు బయటికెళ్లగానే ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరిగొచ్చిన తల్లిదండ్రులు కుమారుడిని అలా చూసి గుండెలవిసేలా రోదించారు.
Similar News
News July 9, 2025
తెనాలి: ఆలయ హుండీలో రద్దైన నోట్లు

వైకుంఠపురం దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీల లెక్కింపులో రద్దైన పాత రూ.1000, రూ. 500 నోట్లు ప్రత్యక్షమయ్యాయి. ఆరు పాత రూ.1000 నోట్లు, పది పాత రూ.500 నోట్లు వెలుగు చూశాయి. ఆర్‌బీఐ చాలా ఏళ్ల క్రితమే ఈ నోట్లను రద్దు చేసినా, దేవుడి హుండీలో ఇవి కనిపించడం చర్చనీయాంశమైంది. జనవరిలో కూడా ఇక్కడ రూ.2000 నోట్లు లభ్యమయ్యాయి.
News July 9, 2025
సంగారెడ్డి: చేసిన సేవలే గుర్తింపునిస్తాయి: డీఈవో

జహీరాబాద్ మండల విద్యాధికారిగా పని చేసిన బస్వరాజు పదవీ విరమణ పొందారు. బుధవారం అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ అనేది సహజమన్నారు. విధి నిర్వహణలో చేసిన సేవలే గుర్తింపునిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ఉపాధ్యాయులు ఎంఈఓలు పాల్గొన్నారు.
News July 9, 2025
సిద్దిపేట: డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలి: సీపీ

సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా రాజేశ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధను కలసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ ఆయనను అభినందించి, శాంతి భద్రతలకు పెద్దపీట వేయాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని సూచించారు.