News July 4, 2025

NGKL: సీఎం రేవంత్ రెడ్డి జూరాలను సందర్శించాలి: జాన్ వెస్లీ

image

జూరాల ప్రాజెక్టు గేట్లు దెబ్బతిన్న విషయంపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి జూరాల ప్రాజెక్టును సందర్శించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. జూరాల ప్రాజెక్టును స్థానిక సీపీఎం నాయకులతో కలిసి శుక్రవారం ఆయన సందర్శించారు. సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు గేట్లకు వెంటనే మరమ్మతులు చేయించాలని కోరారు.

Similar News

News July 5, 2025

శుభ సమయం (05-07-2025) శనివారం

image

✒ తిథి: శుక్ల దశమి సా.6.20 వరకు తదుపరి ఏకాదశి
✒ నక్షత్రం: స్వాతి రా.8.00 వరకు తదుపరి విశాఖ
✒ శుభ సమయం: ఉ.10.30-మ.12.00 వరకు, మళ్లీ సా.5.39-6.27 వరకు
✒ రాహుకాలం: ఉ.9.00-10.30
✒ యమగండం: మ.1.30-3.00
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-7.36
✒ వర్జ్యం: రా.2.13-3.59
✒ అమృత ఘడియలు: ఉ.10.16-మ.12.02

News July 5, 2025

20 బైకులను ప్రారంభించిన నెల్లూరు SP

image

జిల్లాలో రాత్రిళ్లు నిఘాను మరింత పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు SP కృష్ణ కాంత్ తెలిపారు. ఇందులో భాంగంగా 20 బైకులను ఆయన శుక్రవారం ప్రారంభించారు. పగలు, రాత్రిళ్లు గస్తీకి వీటిని వాడనున్నట్లు స్పష్టం చేశారు. నెల్లూరు ట్రాఫిక్, నెల్లూరు టౌన్, రూరల్, ఆత్మకూరు, కావలి, కందుకూరు సబ్ డివిజన్‌లకు వాటిని కేటాయించినట్లు తెలిపారు.

News July 5, 2025

SPMVV: ప్రాజెక్టు ఫెలోషిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికగా ప్రాజెక్టు ఫెలోషిప్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్, మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసిన మహిళా అభ్యర్థులు అర్హులని తెలిపింది. ఇతర వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించింది.దరఖాస్తులకు చివరి తేదీ జూలై 14.