News April 16, 2025

NGKL: సెలవుల్లో.. నల్లమల స్వాగతం పలుకుతోంది!

image

వేసవి సెలవులకు నాగర్ కర్నూలు జిల్లా స్వాగతం పలుకుతోంది. సెలవుల్లో కుటుంబ సమేతంగా పచ్చని అడవులలో ఆహ్లాదకర వాతావరణంలో టూర్ ప్లాన్ చేసుకునేలా మంచి వేదిక కానుంది. అచ్చంపేట ఉమామహేశ్వరం శివాలయం, పచ్చని వాతావరణం, కొండలు, గుట్టలు కలిగి ఉన్న ప్రాంతం, అమ్రాబాద్ పబ్బతి ఆంజనేయ స్వామి టెంపుల్ చూడ చక్కని ప్రదేశం. పర్యాటక ప్రాంతాలు సందర్శించి పచ్చని చెట్ల మధ్య విందు చేస్తూ ఆహ్లాదం పొందవచ్చు.

Similar News

News February 28, 2026

జగిత్యాల: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. నిలువు దోపిడి

image

జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఒక మహిళకు విజయవాడకు చెందిన వంశీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళను వేములవాడకు రప్పించాడు. ఇద్దరూ కలిసి స్థానిక ప్రైవేట్ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. ​ఆ మహిళ బాత్రూమ్‌కి వెళ్లిన సమయంలో ఆమె బ్యాగులో ఉన్న 3తులాల బంగారు గొలుసుతో పాటు రూ.10వేలు తీసుకొని పరారయ్యాడు. దీంతో బాధిత మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

News February 28, 2026

అనంత: పోలీస్ వాహనం ధ్వంసం.. నిందితుడి అరెస్ట్

image

మద్యం మత్తులో భార్యపై దాడి చేయడమే కాకుండా పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం రాణినగర్‌కు చెందిన బళ్లారి బాబా మౌలా మద్యం మత్తులో తన భార్యను కొడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి వెళ్లగా వారిపై తిరగబడి వాహనాన్ని ధ్వంసం చేశాడు, దీంతో అతన్ని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ (జిల్లా జైలు)కు తరలించారు.

News February 28, 2026

అఫ్గానిస్థాన్‌తో అంత ఈజీ కాదు!

image

అఫ్గానిస్థాన్‌కు ‘సామ్రాజ్యాల శ్మశానం’ అని పేరుంది. 19వ శతాబ్దంలో బ్రిటన్, గత శతాబ్దంలో సోవియట్ యూనియన్, ఇటీవల అమెరికా వంటి అగ్రరాజ్యాలు ఇక్కడ అడుగుపెట్టి భారీ ప్రాణ, ఆస్తి నష్టంతో వెనుదిరిగాయి. దుర్భేద్యమైన హిందూకుష్ పర్వతాలు, స్థానిక తెగల గెరిల్లా పోరాటాల వల్ల ఏ దేశమూ ఇక్కడ నిలబడలేకపోయింది. చరిత్రలో సామ్రాజ్యాలనే మింగేసిన ఈ గడ్డ ఇప్పుడు పాక్‌కు సవాల్ విసురుతోంది.