News April 2, 2025
NGKL: సైబర్ నేరాలపై పోలీస్ శాఖ అవగాహన సదస్సు

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ(ఆర్ట్స్) కాలేజీలో నేడు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని పోలీస్ శాఖ నిర్వహించింది. కార్యక్రమంలో జిల్లా టౌన్ SI గోవర్ధన్ మాట్లాడుతూ.. సైబర్ నేరాలకు ఎవరైనా గురైతే వెంటనే హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కృష్ణయ్య, పోలీస్ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
Similar News
News February 28, 2026
మెదక్: మాజీ కలెక్టర్ రాహుల్ రాజ్‌కు ఘనంగా వీడ్కోలు

రెండేళ్ల పాటు మెదక్ కలెక్టర్‌గా పనిచేసి సహకార శాఖ ప్రత్యేక కమిషనర్‌గా బదిలీ అయిన రాహుల్ రాజ్‌కు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. వినూత్న పద్ధతులు, విప్లవాత్మక నిర్ణయాలతో మెదక్ జిల్లాను రాహుల్ రాజ్ రోల్ మోడల్‌గా నిలిపారని కొనియాడారు. పాలనలో ఆయన తనదైన ముద్ర వేశారని అధికారులు గుర్తు చేసుకున్నారు.
News February 28, 2026
మద్దూరు: మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

మద్దూరు మండలం లద్నూర్ గ్రామానికి చెందిన ఆలేటి మహేష్(28) శుక్రవారం తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న మహేష్, తీవ్ర మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ అసిఫ్ ఆధ్వర్యంలో ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.
News February 28, 2026
వాంఖడేలో ‘రవిశాస్త్రి’ స్టాండ్

వాంఖడే స్టేడియంలో లెవెల్-1 స్టాండ్‌కు మాజీ కెప్టెన్ రవిశాస్త్రి పేరు పెట్టాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. క్రికెటర్, కోచ్, కామెంటేటర్‌గా ఆయన సేవలకు గుర్తింపుగా ప్రెస్ బాక్స్ కింది స్టాండ్‌కు ఆయన పేరు పెట్టనున్నారు. అలాగే దిలీప్ సర్దేశాయ్, ఏక్‌నాథ్ సోల్కర్, డయానా ఎడుల్జీ పేర్లను స్టేడియం గేట్లకు పెట్టనున్నారు. ముంబై దిగ్గజాలను గౌరవించే క్రమంలో అపెక్స్ కౌన్సిల్ దీనికి ఆమోదం తెలిపింది.


