News October 5, 2025
NGKL: స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి రద్దు

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వెలువడినందున ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News October 5, 2025
కురుపాం ఘటన.. మంత్రికి సీఎం ఫోన్

కురుపాం గురుకుల విద్యార్థినిల మృతి ఘటనపై మంత్రి సంధ్యారాణితో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. సీఎం ఆదేశాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినిలను మంత్రి సంధ్యారాణి పరామర్శించారు. రేపు కురుపాం పాఠశాలకు వెళ్లి మిగిలిన విద్యార్థినిలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
News October 5, 2025
తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి: CBN

AP: శ్రీశైలం ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆలయంలో వసతుల కల్పనపై Dy.CM పవన్ కళ్యాణ్, మంత్రి ఆనం రామనారాయణ, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇతర ప్రముఖ ఆలయాల్లో సౌకర్యాలను పరిశీలించి శ్రీశైలం అభివృద్ధి చేద్దామని సీఎంకు వారు సూచించినట్లు తెలుస్తోంది. ఆలయ అభివృద్ధికి భూమిని కేటాయించేలా కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
News October 5, 2025
చరిత్రలో నిలిచిన నేత ‘కాక’: మంత్రి పొన్నం

హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగిన గడ్డం వెంకట స్వామి జయంతి వేడుకల్లో మంత్రి పొన్నం పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా కార్మిక చట్టాల్లో సంస్కరణలు తెచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కాక దేశంలోనే గొప్ప కార్మిక నాయకుడిగా చరిత్రలోనే నిలిచిపోతారని అన్నారు. రాజకీయ చరిత్రలో కొన్ని పేర్లు చిరస్మనీయంగా ఉంటాయని అందులో కాక పేరు అగ్రస్థానంలో ఉంటుందన్నారు. పదవులకు వన్నెతెచ్చిన నేత అన్నారు.