News October 22, 2025

NGKL: స్థానిక సంస్థల ఎన్నికలపై నాయకులలో మళ్లీ ఉత్కంఠ

image

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నామినేషన్ల వరకు వచ్చి నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈనెల 23న స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర మంత్రివర్గం ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నందున నాయకులలో మళ్లీ ఉత్కంఠ మొదలైంది. ఎన్నికలలో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్న నాయకులు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 20 జడ్పీటీసీ, ఎంపీటీసీ 214, సర్పంచ్ 460 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News October 24, 2025

APEDAలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

APEDA 11 బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్, అసోసియేట్ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. పోస్టును బట్టి బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ (అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, ప్లాంటేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫారెన్ ట్రేడ్, పబ్లిక్ పాలసీ, కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ), PGDM, MBAతో పాటు పని అనుభవం కలిగిన అభ్యర్థులు NOV 6 వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://apeda.gov.in/

News October 24, 2025

దీపావళి టార్గెట్.. ఉగ్ర కుట్ర భగ్నం

image

దీపావళి వేళ విధ్వంసం సృష్టిద్దామనుకున్న ISIS కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. అద్నాన్ అనే పేరుగల ఇద్దరు ISIS ఆపరేటర్లను అరెస్ట్ చేశారు. సౌత్ ఢిల్లీలో దీపావళికి రద్దీగా ఉండే షాపింగ్ మాల్, పబ్లిక్ పార్క్‌‌లో దాడి చేసేందుకు సిద్ధమైన వీరిద్దరినీ ఢిల్లీ, భోపాల్‌లో అదుపులోకి తీసుకున్నారు. పేలుడు పదార్థాలు, టైమర్ వాచ్ స్వాధీనం చేసుకున్నారు. OCT 16నే వారిని అరెస్ట్ చేయగా తాజాగా వివరాలు వెల్లడించారు.

News October 24, 2025

వనపర్తి: మద్యం షాపులకు 757 దరఖాస్తులు

image

వనపర్తి జిల్లాలోని 36 మద్యం షాపుల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు నిన్నటితో ముగిసింది. జిల్లాలో మొత్తం 757 దరఖాస్తులు వచ్చాయని జిల్లా మద్య నిషేధ, ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ దరఖాస్తులకు లాటరీ పద్ధతి ద్వారా ఈ నెల 27న కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో దుకాణాల కేటాయింపు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఈ ప్రక్రియను చేపడతారని తెలిపారు.