News February 24, 2026

NGKL: హాల్ టికెట్‌పై సంతకం లేకున్నా పరీక్షకు అనుమతి: DIEO

image

ప్రైవేట్ కాలేజీలు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా విద్యార్థులు ఆందోళన చెందవద్దని నాగర్‌కర్నూల్ జిల్లా ఇంటర్ విద్యాధికారి (DIEO) వెంకటరమణ తెలిపారు. ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌పై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు మీసేవ ద్వారా హాల్ టికెట్లు పొంది నిశ్చింతగా పరీక్షలు రాయాలని ఆయన సూచించారు.

Similar News

News February 26, 2026

చిత్తూరులో ఆ అధికారులంతా ట్రాన్స్‌ఫర్

image

2018 గ్రూప్-1 బ్యాచ్ అధికారులను ప్రాధాన్యత పోస్టుల నుంచి తప్పించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది RDOలు, 25 మంది DSPలను బదిలీ చేస్తూ హెడ్ క్వార్టర్స్ జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో చిత్తూరు జిల్లా కుప్పం, నగరి RDOలు శ్రీనివాసులు రాజు, భవాని శంకరి, నగరి DSP మహమ్మద్ అజీజ్, సాంఘిక సంక్షేమశాఖ DD విక్రమ్ కుమార్ రెడ్డి బదిలీ అయ్యారు

News February 26, 2026

సిరిసిల్ల: అదనపు కలెక్టర్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు

image

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా విధుల్లో తొలి రోజు నుంచి ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన గరీమా అగ్రవాల్ ఇదే జిల్లాకు కలెక్టర్ కావడం విశేషం. 2025 అక్టోబర్ 23న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా విధుల్లో చేరిన ఆమె.. అప్పటి కలెక్టర్ ఎం.హరిత సెలవుపై వెళ్లడంతో 4 నెలలుగా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం జిల్లా పూర్తిస్థాయి కలెక్టర్‌గా నియమితులయ్యారు.

News February 26, 2026

మన్యం: 3 రోజుల క్రితమే వచ్చి అంతలోనే మృత్యవాత.. జవాన్ వివరాలివే

image

జియ్యమ్మవలస(M) శిఖబడి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ దవలసింగి చంద్రమౌళి(29) గిజబ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. గ్రామస్థుల వివరాలు మేరకు మృతుడు.. గుజరాత్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల క్రితం సెలవుపై స్వగ్రామానికి వచ్చి ఓ వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ సంఘటన జరిగిందన్నారు. మూడు సంవత్సరాల క్రితం వివాహమైందని భార్య, సంవత్సరం వయస్సున్న పాప ఉన్నారన్నారు.