News September 21, 2025

NGKL: హెచ్1బి ఫీజులు భారత యువతకు దెబ్బ

image

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన హెచ్1బి అసాధారణ ఫీజులను నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థకు, నిరుద్యోగ యువతకు, అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు చావుదెబ్బగా మారుతుందని అన్నారు. భారత ప్రభుత్వం తక్షణమే స్పందించి అమెరికాకు గట్టి సమాధానం ఇవ్వాలని, అవసరమైతే పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Similar News

News September 21, 2025

జగిత్యాల: రేపటి ప్రజా వాణి రద్దు

image

జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం (రేపు)నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ B. సత్యప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం సమావేశం ఏర్పాటు చేసినందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటనలో వెల్లడించారు. ప్రజలు వినతులు ఇవ్వడానికి కలెక్టరేట్‌కు రావొద్దని విజ్ఞప్తి చేశారు.

News September 21, 2025

విజయవాడ: జగజ్జననీకి సమర్పించే నైవేద్యం ఇదే

image

కనకదుర్గమ్మవారికి వేకువజాము సుప్రభాతం, పూజాదికాలు, సాంబ్రాణి అనంతరం బాలభోగం కింద దద్ధోజనం సమర్పిస్తారు. తర్వాత ఉదయం 10కి రవ్వకేసరి, పులిహోర, దద్ధోజనం, కట్టెపొంగలి, లడ్డు బూంది, చక్రపొంగలితో రాజభోగం, 12కి గారెలతో పంచభోగాలను నివేదిస్తారు. సాయంత్రం 4కి శనగలు, స్వీట్, హాట్..6 గంటలకు మహానివేదనలో కదంబవంటకం, కూరలు, స్వీట్, హాట్ తదితర పదార్థాలు అమ్మవారికి సమర్పిస్తామని అర్చకులు వెల్లడించారు.

News September 21, 2025

దసరా పండుగ.. జర ఇల్లు భద్రం: వరంగల్ సీపీ

image

దసరా సెలవులకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రజలను అప్రమత్తం చేశారు. దసరా సెలవులను పురస్కరించుకొని తమ స్వగ్రామాలు, విహార యాత్రలకు తరలి వెళ్తుండటంతో ఇళ్లల్లో చోరీలను నియంత్రణ చేసేందుకు పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే, చోరీల కట్టడికై ప్రజలు సైతం తమ వంతు భాధ్యత పోలీసులు సూచినలు పాటించాలని సీపీ ప్రజలకు తెలిపారు.