News March 14, 2025

NGKL: హోలీ పండుగ వేళ విషాదం.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

హోలీ పండుగ వేళ బిజినేపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వెలుగొండకు చెందిన రమేశ్(38) స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనంపై బుద్దారంగండి నుంచి బిజినేపల్లికి వస్తున్నాడు. ఈ క్రమంలో శాయిన్‌ప‌ల్లిలో స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపు తప్పడంతో రమేశ్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరొకరికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రమేశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు.

Similar News

News February 28, 2026

కేజ్రీవాల్ రీఎంట్రీ.. కాంగ్రెస్‌కు కష్టకాలమేనా?

image

కోర్టు క్లీన్ చిట్‌తో <<19251338>>కేజ్రీవాల్‌<<>>కు రాజకీయంగా కొత్త ఊపిరి లభించింది. పంజాబ్, గుజరాత్, గోవా వంటి రాష్ట్రాల్లో AAP పుంజుకునే అవకాశం ఉంది. ఇది నేరుగా కాంగ్రెస్ ఓటు బ్యాంకునే దెబ్బతీసే ప్రమాదం ఉంది. అటు INDIA కూటమిలో రాహుల్ గాంధీ నాయకత్వానికి కేజ్రీవాల్ సవాల్‌గా మారే అవకాశం లేకపోలేదు. కేజ్రీవాల్ ‘సెకండ్ ఇన్నింగ్స్’తో విపక్ష కూటమిలో కాంగ్రెస్ పట్టు కోల్పోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా.

News February 28, 2026

ఆదిలాబాద్: ఆరుగురు దోపిడీ దొంగలు అరెస్టు

image

ఆదిలాబాద్ రైల్వే స్టేషన్, రిమ్స్ పరిసరాల్లో సెల్‌ఫోన్లు లాక్కొంటున్న ఆరుగురు దోపిడీ దొంగల ముఠాను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 15న జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి సీఐ నాగరాజు ఆధ్వర్యంలో నిందితులను పట్టుకున్నారు. వారిలో ఒకరు బాల నేరస్థుడు ఉన్నాడు. నిందితుల నుంచి 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీరిపై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

News February 28, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.