News December 4, 2025
NGKL: 151 గ్రామాలకు 1,046 నామినేషన్లు దాఖలు

నాగర్‌కర్నూల్ జిల్లాలో రెండో విడత జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 151 GP లకు 1,046 నామినేషన్లు దాఖలు అయ్యాయి. బిజినేపల్లిలో 35 జీపీలకు 246, కోడేరులో 16 జీపీలకు 129, కొల్లాపూర్‌లో 18 జీపీలకు 139, నాగర్‌కర్నూల్‌లో 18 జీపీలకు 131, పెద్దకొత్తపల్లిలో 28 జీపీలకు 201, పెంట్లవెల్లిలో పది జీపీలకు 64, తిమ్మాజీపేటలో 26 జీపీలకు 134 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 1412 వార్డులకు గాను 3,810 దాఖలు అయ్యాయి.
Similar News
News December 4, 2025
NZB: ఎన్నికల కోడ్ పక్కాగా అమలయ్యేలా చూడాలి

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీ కుముదిని సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎన్నికలు ముగిసే వరకు అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పటిష్టంగా అమలు చేయాలన్నారు.
News December 4, 2025
WGL: మొక్కజొన్న క్వింటాకి రూ.2,020

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న ధర నిన్నటితో పోలిస్తే నేడు భారీగా పెరిగింది. మక్కలు బిల్టీకి సోమవారం రూ.1,935, మంగళవారం రూ.1,905, బుధవారం రూ.1,945 ధర వచ్చింది. నేడు రూ.2,020 అయింది. దీంతో మొక్కజొన్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, క్వింటా పచ్చి పల్లికాయకు నిన్న రూ.5,400 ధర రాగా, నేడు రూ.4,700 అయినట్లు వ్యాపారులు తెలిపారు.
News December 4, 2025
కారంపూడి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

కారంపూడి విద్యుత్ ఏఈ పెద్ద మస్తాన్ రూ.25 వేలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కారంపూడికి చెందిన వలీ ఇంజినీరింగ్ వర్క్స్ వారికి అదనపు మీటర్లు కేటాయించడానికి డబ్బులు అడగడంతో వారు ఏసీబీని ఆశ్రయించారు. ఇవాళ బాధితుడు వలి నుంచి ఏఈ రూ.25,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేందర్, సిబ్బంది పాల్గొన్నారు.


