News December 4, 2025

NGKL: 151 గ్రామాలకు 1,046 నామినేషన్లు దాఖలు

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో రెండో విడత జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 151 GP లకు 1,046 నామినేషన్లు దాఖలు అయ్యాయి. బిజినేపల్లిలో 35 జీపీలకు 246, కోడేరులో 16 జీపీలకు 129, కొల్లాపూర్‌లో 18 జీపీలకు 139, నాగర్‌కర్నూల్‌లో 18 జీపీలకు 131, పెద్దకొత్తపల్లిలో 28 జీపీలకు 201, పెంట్లవెల్లిలో పది జీపీలకు 64, తిమ్మాజీపేటలో 26 జీపీలకు 134 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 1412 వార్డులకు గాను 3,810 దాఖలు అయ్యాయి.

Similar News

News December 4, 2025

సచివాలయంలో IASల ‘Speed vs Side’ వార్!

image

TG: సచివాలయంలో IASల అంతర్గత పోరు పీక్స్‌కు చేరింది. సెక్రటేరియట్‌లో 8 మంది సీనియర్ IASలతో SPEED పేరిట ఓ గ్రూప్ క్రియేట్ అయింది. CM మీటింగ్స్, కీలక అంశాలపై ఆ సభ్యులకే సమాచారం వెళ్తోందట. దీంతో ఆ గ్రూప్‌లో లేని అధికారుల్లో.. తమను పక్కనబెట్టారనే అసహనం రోజురోజుకూ పెరుగుతోందని తెలుస్తోంది. ఆ అసంతృప్త అధికారుల్లో కొందరు తమకు తెలిసిన విషయాలు లీక్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు Way2Newsకు తెలిపాయి.

News December 4, 2025

ఖమ్మం: ఎన్నికల్లో ఘర్షణలు జరగకుండా చూడాలి: సీపీ

image

పంచాయతీ ఎన్నికలు ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో నిశితంగా పర్యవేక్షించాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. పోలీస్ స్టేషన్ సెక్టర్ అధికారులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్స్‌తో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా గ్రామపంచాయతీ ఎన్నికల బందోబస్త్‌పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా, ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకుండా పోలీసులు పనిచేయాలన్నారు.

News December 4, 2025

సిరిసిల్ల జిల్లాలో 657 మంది బైండోవర్: SP

image

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 158 కేసులలో 657మందిని బైండోవర్ చేసినట్టు ఎస్పీ మహేష్ బిగితే అన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆయన ఎన్నికల నామినేషన్ కేంద్రాలు, చెక్ పోస్టులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి బెల్ట్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించి 20 కేసుల్లో 209 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.