News December 14, 2025

NGKL: 23.06 శాతం పోలింగ్ నమోదు.

image

రెండవ విడత సర్పంచ్ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా ఏడు మండలాల్లో ఉదయం 9:00 సమయానికి 23.06 శాతం పోలింగ్ నమోదు అయినట్టు ఎలక్షన్ అధికారులు వెల్లడించారు. 100% పోలింగ్ అయ్యే అవకాశం ఉందని గ్రామస్తులు ఓటర్లు తెలుపుతున్నారు. ఓటు వినియోగించుకునేందుకు యువత మరియు గ్రామస్తులు తరలివస్తున్నారు.

Similar News

News December 14, 2025

సిరిసిల్లలో రేపు కేటీఆర్ పర్యటన

image

సిరిసిల్ల నియోజకవర్గంలో రేపు సోమవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్‌లో ఉదయం 11.00 గంటలకు మొదటి విడుతలో వేములవాడ నియోజకవర్గం నుంచి గెలుపొందిన నూతన సర్పంచ్‌లు, రెండవ విడతలో గెలిచిన తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, బోయినిపల్లి మండలాల సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు.

News December 14, 2025

ఉమ్మడి జిల్లాలో చిన్నచింతకుంటలో రిజల్ట్‌పై ఉత్కంఠ

image

చిన్నచింతకుంట మండలం గూడూరు గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులందరికీ 280 ఓట్లు చొప్పున సమానంగా పోలయ్యాయి. రీకౌంటింగ్‌లోనూ మార్పు లేకపోవడంతో అధికారులు టాస్ (లాటరీ) ద్వారా విజేతను ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. అయితే అభ్యర్థులు దానికి ఒప్పుకోకపోవడంతో ఫలితం ఇంకా ప్రకటన కాలేదు. మరోసారి కౌంటింగ్ లేదా టాస్‌తోనే నిర్ణయమవుతుందన్న ఉత్కంఠ గ్రామలతో నెలకొంది.

News December 14, 2025

సర్పంచ్ ఎన్నికలు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే?

image

TG: రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. రాత్రి 7 గంటల వరకు కాంగ్రెస్ మద్దతుదారులు 1,500కు పైగా, BRS 800, BJP 200 సీట్లలో విజయం సాధించారు. ఇతరులు 440 సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నారు. అటు కేటీఆర్, హరీశ్ రావు సొంత నియోజకవర్గాలైన సిరిసిల్ల, సిద్దిపేటలో BRS అత్యధిక స్థానాలు గెలుచుకుంది. రెండో విడతలో 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 3,911 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి.