News March 19, 2025

NGKL: 26వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు

image

శ్రీశైలం ఎడమ గట్టు ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. 26వ రోజు బుధవారం మరోసారి క్యాడవర్ డాగ్స్ బృందం సహాయక చర్యల్లో పాల్గొనేందుకు టన్నెల్‌లోకి వెళ్లారు. రెస్క్యూ ఆపరేషన్ మరింత వేగవంతం చేశారు. జిల్లా కలెక్టర్ భాగవత్ సంతోష్ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఏడుగురి ఆచూకీ కనుగొనేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Similar News

News September 13, 2025

జగిత్యాల: శాంతి భద్రతలకు విఘాతం.. పీడీ యాక్ట్ నమోదు

image

శాంతి భద్రతలకు భంగం కలిగించిన వ్యక్తిపై పిడి యాక్ట్ నమోదు చేసినట్లు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జగిత్యాల విద్యానగర్‌కు చెందిన బండి తరాల శ్రీకాంత్‌పై పలుమార్లు కేసులు నమోదైనా, అతని ప్రవర్తనలో మార్పు రాలేదని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో, అతనిపై పిడి యాక్ట్ నమోదు చేసి కరీంనగర్ జైలులో ఉంచి, చర్లపల్లి జైలుకు తరలించినట్లు ఎస్పీ చెప్పారు.

News September 13, 2025

షాకింగ్: HD క్వాలిటీతో ‘మిరాయ్’ పైరసీ!

image

కొత్త సినిమాలను పైరసీ బెడద వీడట్లేదు. నిన్న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ‘మిరాయ్’ సినిమా ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చిందని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. మూవీ HD క్వాలిటీతో అందుబాటులో ఉందని చెబుతున్నారు. ఇది దారుణమని, సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. మేకర్స్ దీనిపై దృష్టి పెట్టి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

News September 13, 2025

విశాఖ చేరుకున్న జేపీ నడ్డా

image

విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో జగత్ ప్రకాష్ నడ్డాకు శనివారం ఘన స్వాగతం లభించింది. రేపు జరగనున్న సారథ్యం బహిరంగ సభలో పాల్గొనడానికి ఆయన నగరానికి చేరుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో కలిసి అనకాపల్లి ఎంపీ సీఎం.రమేశ్ పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయంగా స్వాగతం పలికారు.