News April 13, 2025
NGKL: BRS, BJP నాయకులు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు: మల్లు రవి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో లేనిది ఉన్నట్లు కల్పితాలు సృష్టించి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి విమర్శించారు. దిల్లీలో శనివారం మీడియా సమావేశంలో ఆయన సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టిన విషయం నిజం కాదంటూ ప్రశ్నించారు.
Similar News
News November 24, 2025
మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు.. రూ.304 కోట్లు జమ

TG: రాష్ట్ర ప్రభుత్వం రూ.304 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసింది. 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో ఈ నగదు జమ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో డీఆర్డీఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.
News November 24, 2025
ఖమ్మం: త్వరలో ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు

అర్హులైన రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ పథకం కింద పెట్టుబడి సాయం త్వరలో జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. భూమి ఉన్న రైతులతో పాటు, భూమి లేని వ్యవసాయ కార్మికులకూ ఎకరానికి సంవత్సరానికి రూ.12,000 చొప్పున ఈ సాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. త్వరలో డబ్బులు జమ అవుతాయని మంత్రి భరోసా ఇచ్చారు.
News November 24, 2025
VIRAL: ట్రంప్ జూనియర్‌తో రామ్ చరణ్

US ఫార్మా దిగ్గజం రామరాజు మంతెన కుమార్తె వివాహ వేడుక ఉదయ్‌పూర్‌లోని రాజభవనంలో ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌ను కలుసుకున్నారు. వీరిద్దరూ సరదాగా మాట్లాడుకుంటున్న ఫొటో ఒకటి వైరలవుతోంది. ఇదీ చరణ్ రేంజ్ అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.


