News April 13, 2025
NGKL: BRS, BJP నాయకులు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు: మల్లు రవి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో లేనిది ఉన్నట్లు కల్పితాలు సృష్టించి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి విమర్శించారు. దిల్లీలో శనివారం మీడియా సమావేశంలో ఆయన సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టిన విషయం నిజం కాదంటూ ప్రశ్నించారు.
Similar News
News April 16, 2025
నాగర్‌కర్నూల్: ‘వయసు రీత్యా వృద్ధులకు కంటిలో శుక్లాలు ఏర్పడతాయి’

నాగర్ కర్నూల్ జిల్లా పాత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి స్వరాజ్యలక్ష్మి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. వృద్ధుల్లో వయసు రీత్యా కంటి శుక్లాలు ఏర్పడతాయని, ఆపరేషన్ చేయించి ఐఓఎల్ పొరను అమర్చడం ద్వారా అంధత్వాన్ని నివారించవచ్చు అని అన్నారు. క్షేత్రస్థాయి ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలందరూ కంటి శుక్లాలు గల అనుమానితులందరినీ శిబిరానికి తీసుకురావాలని అన్నారు.
News April 16, 2025
NGKL: పరిశ్రమల కమిటీ సమావేశంలో పాల్గొన్న MP

గౌహతిలో నిర్వహించిన పార్లమెంటరీ పరిశ్రమల స్టాండింగ్ కమిటీ సమావేశంలో నాగర్‌కర్నూల్ ఎంపీ, తెలంగాణ ఎంపీల ఫోరం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మల్లు రవి పాల్గొన్నారు. పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, ప్రాంతీయ పరిశ్రమల స్థితిగతులపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరగ్గా, తెలంగాణకు మరిన్ని పారిశ్రామిక అవకాశాలు కల్పించాలని డాక్టర్ మల్లు రవి కోరారు.
News April 16, 2025
సాతాపూర్ గ్రామంలో అటవీ భూముల సర్వే: ఎమ్మార్వో

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశాల మేరకు పెద్దకొత్తపల్లి మండల పరిధి కొత్తపేట శివారు సర్వే నంబర్.170,177లో ప్రభుత్వ అటవీ భూముల సర్వే నిర్వహిస్తున్నామని తహశీల్దార్ జేకే మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది, మండల సర్వేయర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ తదితరులు సంయుక్తంగా పాల్గొని ప్రభుత్వ అటవీ భూముల సర్వే నిర్వహిస్తున్నామన్నారు. సర్వే ఇంకా కొనసాగుతోందని ఎమ్మార్వో తెలిపారు.