News March 5, 2025

NGKL: BSP అసెంబ్లీ స్థాయి సమీక్ష సమావేశం

image

BSP నాగర్ కర్నూల్ పార్టీ ఆఫీసులో బుధవారం అసెంబ్లీ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ అధ్యక్షుడు కళ్యాణ్ మాట్లాడుతూ.. వివిధ మండలాల్లో పార్టీ బలోపేతం కొరకు గ్రామ స్థాయి నుంచి అసెంబ్లీ స్థాయి వరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి ప్రతి బూత్‌లో ఏనుగు గుర్తును పరిచయం చేయాలన్నారు. కార్యక్రమంలో హర్ష ముదిరాజ్, నాగేష్, భాస్కర్, రాజు, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 3, 2026

GNT: ప్రముఖులకు స్వాగతం పలికిన అధికారులు

image

సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటమ్ శ్రీ నరసింహ, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుకు గుంటూరులో ఘన స్వాగతం లభించింది. శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్‌లో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనేందుకు వారు విచ్చేశారు. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ అతిథులకు స్వాగతం పలికారు.

News January 3, 2026

కొండగట్టు: ‘పవన్’ పర్యటన నేపథ్యంలో ప్రత్యేక వైద్య శిబిరం

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో భక్తులకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు అవసరమైన మందులు, ఔషధాలు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచారు. ఈ శిబిరాన్ని జిల్లా వైద్యాధికారి సుజాత, ఉప వైద్యాధికారి శ్రీనివాస్, మండల వైద్యాధికారి మౌనిక సమన్వయంతో నిర్వహించారు.

News January 3, 2026

క్రికెట్ బాల్ తగిలి ఎవరైనా చనిపోతే శిక్షేంటి?.. UPSCలో ప్రశ్న!

image

సివిల్స్ ఇంటర్వ్యూలో ఒక లా గ్రాడ్యుయేట్‌కు విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. ‘మీరు కొట్టిన సిక్సర్ వల్ల పార్క్ బయట ఉన్న వ్యక్తికి బాల్ తగిలి అతను చనిపోతే మీ బాధ్యత ఏమిటి?’ అని బోర్డు ప్రశ్నించింది. అభ్యర్థి హాబీ క్రికెట్ కావడంతో ఈ ప్రశ్న అడిగారు. అభ్యర్థుల హాబీలు, నేపథ్యాన్ని బట్టి ప్రశ్నలు వస్తాయని UPSC ట్రైనర్ కేతన్ సర్ వివరించారు. కావాలని గాయపరచలేదు కాబట్టి శిక్ష ఉండదని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.