News March 5, 2025
NGKL: BSP అసెంబ్లీ స్థాయి సమీక్ష సమావేశం

BSP నాగర్ కర్నూల్ పార్టీ ఆఫీసులో బుధవారం అసెంబ్లీ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ అధ్యక్షుడు కళ్యాణ్ మాట్లాడుతూ.. వివిధ మండలాల్లో పార్టీ బలోపేతం కొరకు గ్రామ స్థాయి నుంచి అసెంబ్లీ స్థాయి వరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి ప్రతి బూత్‌లో ఏనుగు గుర్తును పరిచయం చేయాలన్నారు. కార్యక్రమంలో హర్ష ముదిరాజ్, నాగేష్, భాస్కర్, రాజు, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 22, 2026
ఉమ్మడి తూ.గో జిల్లాకు మరో ఎయిర్‌పోర్టు

రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా 9 ఎయిర్‌పోర్టులు నిర్మించే ప్రణాళికలో భాగంగా కాకినాడ జిల్లా తుని – అన్నవరం మధ్య విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం మొగ్గు చూపింది. తొలుత కరప మండలం గురజానాపల్లిలోని సాల్ట్ భూములను పరిశీలించినా, సాంకేతిక కారణాలతో తుని ప్రాంతాన్ని ఎంపిక చేస్తూ డీపీఆర్ సిద్ధం చేశారు. ఇక్కడ భూసేకరణ వల్ల ఆర్థిక భారం పడినా, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఇక్కడే నిర్మాణానికి అంగీకరించింది.
News February 22, 2026
కుండలు అమ్మే వ్యక్తికి ₹1.25 కోట్ల GST నోటీస్

రాయ్‌బరేలీ(UP)కి చెందిన సయీద్ అనే వ్యక్తి ₹2 విలువ చేసే చిన్న కుండలు అమ్ముతూ జీవిస్తున్నారు. ఆయనకు ఏకంగా ₹1.25 కోట్ల GST నోటీసు రావడం చూసి అవాక్కయ్యారు. ఆయన పేరిట 4 కంపెనీలు నడుస్తున్నట్లు వాటిలో ఉంది. గతంలో లోన్ కోసం ఆధార్, పాన్ కార్డులు ఇస్తే.. వాటిని ఎవరో కేటుగాళ్లు తప్పుడు వ్యాపారాలకు వాడినట్లు తెలుస్తోంది. కడు పేదరికంలో ఉన్న సయీద్.. తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను వేడుకున్నారు.
News February 22, 2026
అన్నమయ్య: ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్

ఈ నెల 23 నుంచి ఇంటర్మీడియేట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్నమయ్య జిల్లాలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా SP ధీరజ్ తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో జిరాక్స్ సెంటర్లు తప్పనిసరిగా మూసివేయాలని యాజమాన్యాలకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.


