News March 16, 2024
NGKL: భార్యను చంపి భర్త ఆత్మహత్య

భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం రాజాపూర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన శివశంకర్ తన భార్య భారతిని గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలు భారతి 5 నెలల గర్భిణి. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 11, 2026
MBNR : పదో తరగతి పరీక్షలు.. ఫోన్ వాడితే ఉద్యోగం ఊస్ట్!

మహబూబ్‌నగర్ జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎవరినీ మొబైల్ ఫోన్లతో అనుమతించకూడదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు అతిక్రమించి ఫోన్ వాడుతూ పట్టుబడితే, వారిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగిస్తామని అధికారులు హెచ్చరించారు.
News March 11, 2026
దేవరకద్రలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేవరకద్రలో అత్యధికంగా 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గండీడు (36.0), భూత్పూర్ (35.7), కోయిలకొండ (35.6) మండలాల్లోనూ ఎండ ప్రభావం అధికంగా ఉంది. చిన్నచింతకుంట, అడ్డాకుల, నవాబుపేట ప్రాంతాల్లో 34 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చిలోనే ఎండలు ముదురుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
News March 10, 2026
హెచ్‌సీఏ సెక్రటరీగా పాలమూరు వాసి నియామకం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) సెక్రటరీగా పాలమూరు జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మన్నే జీవన్ రెడ్డి నియమితులయ్యారు. మంగళవారం ఆయన తన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తెచ్చి, తెలంగాణలో క్రికెట్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు.


