News March 5, 2025
NGKL: HYDలో శిరీష మర్డర్ UPDATE..

HYDలోని మలక్పేటలో <<15646088>>శిరీష మృతి కేసు<<>>లో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. శిరీషను ఆమె భర్త, ఆడపడుచు దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల వివరాలు.. NGKLజిల్లాలోని దోమలపెంటకు చెందిన వినయ్కి ఇంతకుముందే మూడు పెళ్లిళ్లయ్యాయని, మొదటి భార్యను సైతం హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇవేవీ తెలియకుండా పెళ్లి చేసుకున్న శిరీషను వినయ్, ఆడపడుచు సరిత కలిసి మత్తుఇంజెక్షన్ ఇచ్చి దిండుతో అదిమి, గొంతు నులిమి చంపేశారు.
Similar News
News October 17, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

* జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నామినేషన్ వేసిన INC అభ్యర్థి నవీన్ యాదవ్
* గ్రామీణ ప్రాంతాల్లో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల.. 17 ప్యాకేజీల్లో 7,449km రోడ్లకు రూ.6,294 కోట్లు వెచ్చించనున్న ప్రభుత్వం
* మద్యం దుకాణాల టెండర్లకు రేపటితో ముగియనున్న గడువు.. 2,620వైన్స్లకు 25వేల దరఖాస్తులు
* బీసీ రిజర్వేషన్ల అంశంలో BJPని కాంగ్రెస్ బద్నాం చేస్తోందన్న MP డీకే అరుణ
News October 17, 2025
SDPT: స్థానిక ఎన్నికలు ఆలస్యం.. ఆశావాహుల్లో నిరుత్సాహం

స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఆశవాహుల్లో నిరుత్సాహం నిండింది. ప్రభుత్వం బీసీలకు కల్పించిన 42% రిజర్వేషన్లపై కోర్టు స్టే ఇవ్వడంతో ఎన్నికల పక్రియ ఆగిపోయింది. దీంతో దసరాకు ముందు జోష్లో ఉన్న ఆయా పార్టీల నాయకులు ప్రస్తుతం చల్లబడిపోయారు. పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలకు వెళితే ఎలా అన్న డైలామాలో పడ్డారు. 2018లో 225 స్థానాలు బీసీలకు దక్కగా రిజర్వేషన్లతో 327 స్థానాలు దక్కాయి.
News October 17, 2025
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కోమటిరెడ్డి

గ్రామాలు సుస్థిర అభివృద్ధి దిశగా సాగేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అవసరమైన నిధులను మంజూరు చేస్తామని తెలిపారు. శుక్రవారం తిప్పర్తి మండలంలోని కంకణాలపల్లిలో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి నూతన గ్రామ పంచాయితీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. సుస్థిరమైన పాలన అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.