News March 5, 2025
NGKL: HYDలో శిరీష మర్డర్ UPDATE..

HYDలోని మలక్‌పేటలో <<15646088>>శిరీష మృతి కేసు<<>>లో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. శిరీషను ఆమె భర్త, ఆడపడుచు దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల వివరాలు.. NGKLజిల్లాలోని దోమలపెంటకు చెందిన వినయ్‌కి ఇంతకుముందే మూడు పెళ్లిళ్లయ్యాయని, మొదటి భార్యను సైతం హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇవేవీ తెలియకుండా పెళ్లి చేసుకున్న శిరీషను వినయ్, ఆడపడుచు సరిత కలిసి మత్తుఇంజెక్షన్ ఇచ్చి దిండుతో అదిమి, గొంతు నులిమి చంపేశారు.
Similar News
News December 21, 2025
‘గోట్ టూర్’ కోసం మెస్సీకి రూ.89 కోట్లు!

మెస్సీ గోట్ టూర్ నేపథ్యంలో కోల్‌కతా మైదానంలో జరిగిన అనుకోని సంఘటనలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆర్గనైజర్ శతాద్రు దత్తా సిట్ విచారణలో కీలక విషయాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ‘ఈ టూర్ కోసం మెస్సీకి రూ.89 కోట్లు చెల్లించాం. ప్రభుత్వానికి రూ.11 కోట్లు పన్ను కట్టాం. మొత్తం రూ.100 కోట్ల ఖర్చులో మెజారిటీ నిధులు స్పాన్సర్లు, టికెట్ల అమ్మకాల ద్వారా సేకరించాం’ అని చెప్పినట్లు తెలుస్తోంది.
News December 21, 2025
హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో మేడారం, వరంగల్ చరిత్ర పుస్తకాలు

హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో ‘సమ్మక్క'(ది గ్లోరీ ఆఫ్ మేడారం), ‘కాకతీయుల గురించి మరికొంత’.. పుస్తకాలు ప్రదర్శితం అవుతున్నాయి. ‘I&PR’ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకటరమణ ఈ రెండు పుస్తకాలను రాశారు. ములుగు, వరంగల్ ప్రాంతంలో సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయన స్థానిక చరిత్రపై అధ్యయనం చేశారు. జిల్లాల వారిగా ప్రత్యేకతలను తెలుపుతూ తెలంగాణ సారస్వత పరిషత్ తో కలిసి చరిత్ర నిఘంటువులను రూపొందిస్తున్నారు.
News December 21, 2025
డిసెంబర్ 21: చరిత్రలో ఈరోజు

✤ 1926: సినీ నటుడు అర్జా జనార్ధనరావు జననం
✤ 1939: నటుడు సూరపనేని శ్రీధర్ జననం
✤ 1959: భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ జననం
✤ 1972: ఏపీ మాజీ సీఎం వై.ఎస్.జగన్ రెడ్డి జననం(ఫొటోలో)
✤ 1972: నటి, నిర్మాత దాసరి కోటిరత్నం మరణం
✤ 1989: నటి తమన్నా భాటియా జననం


