News April 27, 2024

NGKL: KCR సభ సక్సెస్‌తో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్..!

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు మద్దతుగా మాజీ సీఎం కేసీఆర్ ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్ సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణులలో కొత్త జోష్ కనిపిస్తుంది. కేసీఆర్ సభకు జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కేసీఆర్ మాట్లాడుతున్నంత సేపు కార్యకర్తల ఈలలు, కేకలతో సభా ప్రాంగణం మారు మోగింది..

Similar News

News October 16, 2025

కురుమూర్తి బ్రహ్మోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ

image

చిన్నచింతకుంట మండలం అమ్మాపురం శివారులోని శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ మేరకు శ్రీ కురుమూర్తి దేవస్థాన ఛైర్మన్ జి.గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేకు ఆహ్వన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి, పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

News October 16, 2025

పాలమూరు యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరైన గవర్నర్

image

పాలమూరు యూనివర్సిటీలో గురువారం నిర్వహించిన 4వ కాన్వకేషన్ (స్నాతకోత్సవం) కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలమూరు యూనివర్సిటీలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ జానకి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, వీసీ శ్రీనివాస్ ఉన్నారు.

News October 16, 2025

పాలమూరు బిడ్డకే గౌరవ డాక్టరేట్

image

ఉమ్మడి పాలమూరు జిల్లా నవాబుపేట(M) గురుకుంటకి చెందిన పారిశ్రామికవేత డాక్టర్ మన్నే సత్యనారాయణ రెడ్డి (MSN)కి పాలమూరు యూనివర్సిటీ మొట్టమొదటి గౌరవ డాక్టరేట్ నేడు గవర్నర్ చేతి మీదగా ప్రదానం చేయనుంది. ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు స్థాపించారు. ప్రస్తుతం ఛైర్మన్, ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ సాధించారు. #CONGRATULATIONS