News March 5, 2025

NGKL: LRS ప్రక్రియ పూర్తి చేయాలి: కలెక్టర్

image

LRS ప్రక్రియ మార్చి 2025 నాటికి పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీఓలు, డిఎల్‌పిఓ, మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడుతూ.. LRS ప్రక్రియపై ప్రజల్లో పూర్తిగా అవగాహన కలిగించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. LRS ప్రక్రియపై అవగాహన సమావేశం నిర్వహించాలాన్నారు.

Similar News

News February 13, 2026

అనంతపురం జిల్లాలో పదోన్నతులు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో డీపీవో, డీఎల్పీవో కార్యాలయాల యూనిట్ నుంచి ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు వచ్చాయి. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-4 నుంచి గ్రేడ్-3 పంచాయతీ కార్యదర్శులుగా ఐదుగురికి కలెక్టర్ ఆనంద్ పదోన్నతి కల్పించినట్లు DPO నాగరాజు నాయుడు తెలిపారు. పదోన్నతి పొందిన ఐదుగురు ఉద్యోగులకు త్వరలోనే పంచాయతీలు కేటాయిస్తామన్నారు.

News February 13, 2026

బంగ్లాదేశ్ ఎన్నికలను రద్దు చేయండి: అవామీ లీగ్

image

బంగ్లాదేశ్ ఎన్నికలను రద్దు చేయాలని నిషేధిత అవామీ లీగ్ పార్టీ డిమాండ్ చేసింది. నియంత యూనస్ నిర్వహించిన ఈ ఎలక్షన్స్ హాస్యాస్పదమని పేర్కొంది. నిన్న 3 గంటల వ్యవధిలో 14.96% ఓటింగ్ నమోదవ్వడం ప్రజా వ్యతిరేకతను చూపించిందని ఓ ప్రకటన రిలీజ్ చేసింది. రాబోయే రోజుల్లో అవామీ లీగ్ మద్దతుదారులపై దాడులు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి ప్రజాహిత ప్రభుత్వాన్ని స్థాపించాలని కోరింది.

News February 13, 2026

త్వరలో మెస్ ఛార్జీలు పెంపు: మంత్రి సవిత

image

AP: బీసీ ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు, గురుకులాల్లో త్వరలోనే మెస్ ఛార్జీలు పెంచనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నోడల్ శాఖ ఆధ్వర్యంలో ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 2014-19 మధ్య కాలంలోనూ అప్పటి TDP ప్రభుత్వం 66% మేర మెస్ ఛార్జీలు పెంచిందని గుర్తు చేశారు.