News March 5, 2025

NGKL: LRS ప్రక్రియ పూర్తి చేయాలి: కలెక్టర్

image

LRS ప్రక్రియ మార్చి 2025 నాటికి పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీఓలు, డిఎల్‌పిఓ, మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడుతూ.. LRS ప్రక్రియపై ప్రజల్లో పూర్తిగా అవగాహన కలిగించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. LRS ప్రక్రియపై అవగాహన సమావేశం నిర్వహించాలాన్నారు.

Similar News

News February 24, 2026

ఈ అలవాట్లతో డేంజర్!

image

జీవనశైలిలో చేసే కొన్ని పొరపాట్లు మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘6 గంటల కంటే తక్కువ నిద్ర, గంటల తరబడి కూర్చోవడం, రాత్రిపూట ఫోన్ వాడటం వల్ల జ్ఞాపకశక్తి తగ్గి డిమెన్షియా ముప్పు పెరుగుతుంది. వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, BP/షుగర్ కంట్రోల్‌లో లేకపోతే మెదడు కణాలు దెబ్బతింటాయి. గురకను నిర్లక్ష్యం చేస్తే స్ట్రోక్ రావొచ్చు. వీటి వల్ల మెదడు వయసు పెరుగుతుంది’ అని చెబుతున్నారు.

News February 24, 2026

ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టెస్టులు చేయించుకోవాల్సిందే..

image

వయస్సు, లైఫ్ స్టైల్ బట్టి మన శరీరంలో నిశ్శబ్దంగా పెరిగే జబ్బులను పట్టుకోవడానికి ఈ 5 ప్రత్యేక పరీక్షలు చాలా అవసరం అంటున్నారు నిపుణులు. HbA1c టెస్ట్ (HbA1c – మూడు నెలల షుగర్ లెవల్స్), విటమిన్ డి, బి12 పరీక్ష, కార్డియాక్ కాల్షియం స్కోర్, సాధారణ కొలెస్ట్రాల్ పరీక్ష కంటే ApoB పరీక్ష గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత ఖచ్చితంగా అంచనా వేస్తుంది. వీటితో పాటు థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించడం కూడా చాలా ముఖ్యం.

News February 24, 2026

అష్టలక్ష్మి: విజయలక్ష్మి దేవిని ఎలా పూజించాలంటే?

image

విజయలక్ష్మి దేవి పూజలో ఎరుపు వస్త్రాలు, పూలను వాడాలి. విజయలక్ష్మి అంటే చేసే ప్రతి పనిలో విజయాన్ని ఇచ్చే దేవత. ఎరుపు రంగు ఉత్తేజానికి, ఉత్సాహానికి చిహ్నం. శత్రువులపై విజయం సాధించాలన్నా లేదా చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా పూర్తి కావాలన్నా ఈ దేవిని ఎరుపు రంగుతో ఆరాధించాలి. పోటీ పరీక్షలు రాసేవారు, కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు విజయలక్ష్మిని ఇలా పూజించడం వల్ల ఆశించిన ఫలితాలు పొంది, జయం చేకూరుతుంది.