News March 25, 2025
NGKL: SLBC ఘటన.. మృతుడు ఇతడే!

SLBC టన్నెల్లో గత నెల 22న జరిగిన దుర్ఘటనలో ఎనిమిది మంది చిక్కుకోగా అందులో <<15882600>>ఈరోజు లభ్యమైన మృతదేహం<<>> యూపీలోని సఫీపురఉన్నా జిల్లా బంగర్మావు గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ (51)గా తెలిసింది. ఈయన కొన్నేళ్లుగా జయప్రకాశ్ అసోసియేట్స్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేసి ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Similar News
News November 15, 2025
MBNR: రోడ్డు ప్రమాదంలో మహిళా కూలీ దుర్మరణం

అడ్డాకుల మండలం రాచాల సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా కూలీ మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. చౌడాయపల్లికి చెందిన మహిళా కూలీలు ఆటోలో వస్తుండగా, ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న కూలీ పద్మ(30) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో మహిళ బురమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. బైక్ నడుపుతున్న వినయ్కు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
News November 15, 2025
ఉష్ణోగ్రతలు పడిపోయాయి.. MBNRలో ఇదీ పరిస్థితి..!

MBNR జిల్లాలో ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. అత్యల్పంగా బాలానగర్ మండల కేంద్రంలో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజాపూర్లో 11.1, గండీడ్ మండలం సల్కర్పేటలో 11.3, మిడ్జిల్లో 12.3, కోయిలకొండ సిరివెంకటాపుర్, భూత్పూర్లో 12.7, మహ్మదాబాద్లో 13.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
News November 14, 2025
కురుమూర్తి స్వామి ఆలయంలో కోడెల వేలం

శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం 2025 బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన 18 కోడెదూడల వేలంపాట నిర్వహించారు. ఈ వేలం ద్వారా ఆలయానికి రూ.1,17,000 ఆదాయం లభించింది. ఈ విషయాన్ని ఆలయ పాలకమండలి ఛైర్మన్ జి. గోవర్ధన్ రెడ్డి, ఈవో మదనేశ్వర్ రెడ్డి తెలిపారు. సభ్యులు భాస్కరాచారి, కమలాకర్ పాల్గొన్నారు.


