News February 22, 2026
NGKL: SLBC ఘటన.. దొరకని ఆరుగురి ఆచూకీ

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) సొరంగం కూలిన భారీ ప్రమాదానికి నేటితో ఏడాది పూర్తయింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద భూగర్భ ప్రమాదంగా నిలిచిన ఈ ఘటనలో జయప్రకాశ్ ఇంజినీరింగ్ కంపెనీకి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురి ఆచూకీ నేటికీ లభ్యం కాకపోవడం వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. మట్టి దిబ్బల కిందే తమ వారు కలిసిపోయారన్న వేదనలో బాధితులు కొట్టుమిట్టాడుతున్నారు.
Similar News
News February 22, 2026
హనీ ట్రాప్.. కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు!

TG: పురుషులను బురిడీ కొట్టించి డబ్బు కాజేయడం, రహస్య సమాచారం సేకరించే హనీ ట్రాప్ కేసులు చూస్తుంటాం. కానీ భద్రాద్రి(D) జేత్యాతండాలో దుండగులు కోడిపెట్టను ఎరగా వేసి పుంజును ఎత్తుకెళ్లారు. రైతు లకావత్ జేత్‌రామ్ 3పుంజులు, ఒక పెట్టను పెంచుకుంటున్నాడు. 3రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి కోడిపెట్టను చూపించి, దగ్గరికి వచ్చిన పుంజును పట్టుకొని ఉడాయించారు. జేత్‌రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News February 22, 2026
సంగారెడ్డి: నేడే గురుకుల ప్రవేశ పరీక్ష

తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కు సర్వం సిద్ధమైంది ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 1 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. సంగారెడ్డి జిల్లాలో 23 పరీక్ష కేంద్రాల్లో 8,598 మంది పరీక్షకు హాజరు కానున్నారని అధికారులు తెలిపారు. 5, 6, 7, 8, 9 తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు (టీజీ సెట్ )పరీక్ష రాయనున్నారు. ఆధార్ కార్డ్ హాల్ టికెట్ తప్పనిసరిగా తెచ్చుకోవాలని అధికారులు తెలిపారు.
News February 22, 2026
కర్నూలు KV సుబ్బారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి అనుమానాస్పద మృతి

నంద్యాల సమీపంలోని పొన్నాపురం వద్ద రైలు పట్టాలపై బీటెక్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు శనివారం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు బేతంచెర్లకు చెందిన విజయ్ కుమార్(27)గా గుర్తించారు. కర్నూలులోని KV సుబ్బారెడ్డి కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.


