News March 25, 2025

NGKL: SLBC ఘటన.. మృతుడు ఇతడే!

image

SLBC టన్నెల్‌లో గత నెల 22న జరిగిన దుర్ఘటనలో ఎనిమిది మంది చిక్కుకోగా అందులో<<15882600>> ఈరోజు లభ్యమైన మృతదేహం<<>> యూపీలోని సఫీపురఉన్నా జిల్లా బంగర్‌మావు గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ (51)గా తెలిసింది. ఈయన కొన్నేళ్లుగా జయప్రకాశ్ అసోసియేట్స్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేసి ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Similar News

News December 19, 2025

ఏలూరు: హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

image

వ్యక్తిని రాడ్‌తో కొట్టి చంపిన ఘటనలో ఇద్దరికి జిల్లా న్యాయమూర్తి జీవిత ఖైదు విధించారు. ఏలూరు తూర్పు వీధికి చెందిన తిరుమల రామ శివ, కలవల నాగరాజులు 2018 మే 17 తేదీ రాత్రి వైన్ షాపు వద్ద యాదాద్రి శ్రీ హర్షతో గొడవపడి అతనిపై రాడ్డుతో దాడి చేసి హత్య చేశారు. వాదోపవాదములు విన్న తర్వాత జిల్లా న్యాయమూర్తి శ్రీదేవి శుక్రవారం మధ్యాహ్నం వీరికి జీవిత ఖైదు విధించారు.

News December 19, 2025

SIR: నేడు తమిళనాడు, గుజరాత్ లిస్ట్స్ విడుదల

image

ఓటర్ లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో భాగంగా తమిళనాడు, గుజరాత్ ఓటర్ల జాబితాను ECI కాసేపట్లో విడుదల చేయనుంది. ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో బెంగాల్ తరహాలో అభ్యంతరాల స్వీకరణకు నెల రోజుల గడువు మాత్రమే ఇచ్చే అవకాశముంది. కాగా ఇటీవల SIR పూర్తైన బెంగాల్‌లో 58 లక్షల ఓట్లు, రాజస్థాన్: 42L, గోవా: 10L, పుదుచ్చేరి: లక్ష, లక్షద్వీప్: 1500 ఓట్లను తొలగించారు.

News December 19, 2025

మన ఎర్రబంగారం బ్రాండ్ అంటే ఇదీ..!

image

TPT: శేషాచలంలో దొరికే ఎర్రచందనంతో సోపులు, లిప్ స్టిక్‌లు తయారు చేస్తున్నారు. ఇలా రూపొందించిన రాయలసీమ RS సోప్‌కు ట్రైడ్ మార్క్, రాయల్ రెడ్ లిప్ స్టిక్‌కు BIS సర్టిఫికెట్ రావడం మన ఎర్రబంగారం విశిష్టతను చాటిచెబుతోంది. ఏపీ వ్యాప్తంగా 1,513 రకాల ఎర్రచందనం జన్యుకణాలను సర్వేలో గుర్తించారు. భవిష్యత్తు తరాలకు మేలైన ఎర్రచందనం అందించాలనే ఉద్దేశంతో ఈ జన్యుకణాల సంరక్షణకు బ్యాంకును సైతం ఏర్పాటు చేయనున్నారు.