News March 25, 2025

NGKL: SLBC ఘటన.. మృతుడు ఇతడే!

image

SLBC టన్నెల్‌లో గత నెల 22న జరిగిన దుర్ఘటనలో ఎనిమిది మంది చిక్కుకోగా అందులో <<15882600>>ఈరోజు లభ్యమైన మృతదేహం<<>> యూపీలోని సఫీపురఉన్నా జిల్లా బంగర్‌మావు గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ (51)గా తెలిసింది. ఈయన కొన్నేళ్లుగా జయప్రకాశ్ అసోసియేట్స్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేసి ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Similar News

News April 11, 2025

బాలానగర్: బావిలో దూసి మహిళ SUICIDE

image

బావిలో పడి మహిళ మృతి చెందిన ఘటన బాలానగర్ మండలంలో చోటుచేసుంది. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. లింగారం గ్రామానికి జంగమ్మ (35)కు కల్లు తాగే అలవాటు ఉండగా ఆమెను భర్త మందలించాడు. మనస్థాపానికి గురైనా ఆమె అందరూ గాఢ నిద్రలో ఉండగా.. గురువారం తెల్లవారుజామున వ్యవసాయ బావిలో దూకి సూసైడ్ చేసుకుంది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

News April 11, 2025

ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్లనిర్మాణానికి ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తహశీల్దార్లు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మఇంటి నిర్మాణాలకు కావాల్సిన ఇసుకను లబ్ధిదారులకు సరఫరా చేసేందుకు పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరించి తహశీల్దార్లకు పంపించాలన్నారు. 

News April 11, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!

image

✔పలుచోట్ల ఈదురుగాలులతో వర్ష బీభత్సం
✔రేపు పూలే జయంతి వేడుకలు
✔నాగర్‌కర్నూల్: సిరసనగండ్ల రథోత్సవంలో లక్షల మంది
✔సళేశ్వరంలో ఆదివాసీ చెంచులే పూజారులు
✔KCR సభకు..BRS పార్టీ శ్రేణులకు పిలుపు
✔ఉమ్మడి జిల్లాల్లో జోరుగా వరి కోతలు
✔NGKL:చిన్నతగాదాతో భార్యాభర్తల సూసైడ్
✔IPL బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు:ఎస్సైలు
✔పలుచోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

error: Content is protected !!