News March 9, 2025
NGKL: SLBC టన్నెల్‌లో మృతదేహాల కోసం ప్రయత్నం

దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు సజీవ సమాధి అయినట్లు తెలుస్తోంది. వారి మృతదేహాలను వెలికి తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓ వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీసినప్పటికీ అతనికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. ఆ మృతదేహం పక్కనే మరో రెండు మృతదేహాలు ఉన్నప్పటికీ వాటిని వెలికి తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Similar News
News March 10, 2025
స్టార్ హీరో సినిమాలో నిధి అగర్వాల్?

యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్‌కు మూవీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తమిళ హీరో సూర్య సరసన ఈ అమ్మడు నటించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ‘లక్కీ భాస్కర్’ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించే సినిమాలో ఆమెను తీసుకుంటారని సమాచారం. నిధితో పాటు మరో అప్‌కమింగ్ హీరోయిన్ ఈ మూవీలో నటిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ సరసన ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్‌తో ‘ది రాజాసాబ్’ చిత్రాల్లో నిధి నటిస్తున్నారు.
News March 10, 2025
రోహిత్ శర్మకు హ్యాట్సాఫ్: షామా మహ్మద్

కెప్టెన్ రోహిత్ శర్మపై <<15636348>>వివాదాస్పద వ్యాఖ్యలు<<>> చేసిన కాంగ్రెస్ నేత షామా మహ్మద్ CT విజేత భారత జట్టుకు అభినందనలు తెలిపారు. 76 పరుగులతో జట్టును ముందుండి నడిపిన హిట్ మ్యాన్‌కు హ్యాట్సాఫ్ చెప్పారు. శ్రేయస్, రాహుల్ కీలక ఇన్నింగ్సుతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారని కొనియాడారు.
News March 10, 2025
KNR: ఈ సోమవారం ప్రజావాణి యథాతథం: కలెక్టర్

ప్రతి సోమవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా రద్దు చేయబడిన ప్రజావాణిని తిరిగి సోమవారం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజలు తమ అర్జీలను సమర్పించాలని సూచించారు.