News March 9, 2025
NGKL: SLBC టన్నెల్‌లో మృతదేహాల కోసం ప్రయత్నం

దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు సజీవ సమాధి అయినట్లు తెలుస్తోంది. వారి మృతదేహాలను వెలికి తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓ వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీసినప్పటికీ అతనికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. ఆ మృతదేహం పక్కనే మరో రెండు మృతదేహాలు ఉన్నప్పటికీ వాటిని వెలికి తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Similar News
News March 10, 2025
టీడీపీలోనే ఉంటా.. ఏ పార్టీలో చేరను: జేసీ పవన్ రెడ్డి

పార్టీ మార్పుపై ప్రచారాన్ని JC పవన్ రెడ్డి కొట్టిపారేశారు. తాను టీడీపీలో ఉన్నానని, ఏ పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైసీపీలోకి వెళ్తున్నట్లు చెప్పడానికే మాజీ మంత్రి శైలజానాథ్ తనను కలిశారని, నిర్ణయం తీసుకున్నాక తాను ఏమి చేయగలనని, ఆల్ ది బెస్ట్ చెప్పినట్లు తెలిపారు. దావోస్ పర్యటనలో అనంతపురం జిల్లాలో రూ.1000కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెండు కంపెనీలతో ఎంవోయూ కుదర్చగలిగానని చెప్పారు.
News March 10, 2025
గరుగుబిల్లి : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

గరుగుబిల్లి మండలం సుంకి గ్రామ ప్రధాన రహదారి వద్ద సోమవారం ఉదయం జరిగిన యాక్సిడెంట్‌లో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. లారీ, కారు ఢీకొన్న సంఘటనలో ఒక వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో 108 ద్వారా పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై గరుగుబిల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
News March 10, 2025
చిత్తూరులో ముగ్గురిపై కేసు నమోదు

మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురిపై చిత్తూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక పాత బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో ముగ్గురు మహిళల చేత వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఆదివారం రాత్రి పోలీసులు లాడ్జిపై దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.