News March 18, 2024
NGKL: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

బిజినేపల్లి మండలంలో రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. వీపనగండ్ల మండల వాసి బాలకృష్ణ HYD వైపు బైక్‌పై వెళ్తున్నాడు. మరో బైక్‌పై సూర్యాపేట జిల్లాకు చెందిన అజయ్, సిద్దార్థ్, భరత్ ఎదురుగా వచ్చి ఢీకొన్నాయి. దీంతో సిద్దార్థ్ అక్కడిక్కడే మృతిచెందగా గాయపడ్డ మరో ముగ్గురిని నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
Similar News
News February 13, 2026
మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ ముందంజ

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతుంది. మొత్తం 60 స్థానాలకు గాను 30 డివిజన్లకు లెక్కింపు పూర్తయింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో, బీఆర్ఎస్ 9 స్థానాల్లో, బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఎంఐఎం 1, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ స్పష్టమైన అధిక్యంలో కొనసాగుతుంది.
News February 13, 2026
MBNR: ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 108 అంబులెన్స్

మహబూబ్‌నగర్, దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 108 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచినట్లు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రవి కుమార్ జిల్లా మేనేజర్ ఉదయ్ తెలిపారు. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులకు లేదా సిబ్బందికి ఏదైనా అనారోగ్యం లేదా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఈ సేవలను వినియోగించుకోవాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
News February 13, 2026
దేవరకద్ర పురపాలికలో తొలి విజయం

దేవరకద్ర పురపాలికల్లో ఎన్నికల ఫలితాల్లో తొలి విజయం నమోదైంది. 12వ డివిజన్‌లో యుగేందర్ రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై 157 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ గెలుపుతో బీఆర్ఎస్ నాయకులలో ఉత్సాహం నెలకొంది. లెక్కింపు కేంద్రం వద్ద కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు. ఇక్కడ ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు.


