News April 2, 2025

NGKL: అమ్మాయిపై గ్యాంగ్ రేప్.. దుండగులను శిక్షించాలని డిమాండ్ 

image

నాగర్ కర్నూల్ జిల్లాలో ఊరుకొండ ఆంజనేయస్వామి దైవ దర్శనానికి వెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు పరుశురాం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిసై ఇలాంటి దుర్ఘటనలకు బాధ్యులు కావద్దని వారన్నారు. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని అన్నారు.

Similar News

News April 5, 2025

పాస్టర్ ప్రవీణ్ మృతిపై తీవ్ర ఆరోపణలు.. హర్ష కుమార్‌పై కేసు నమోదు

image

AP: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ MP హర్ష‌ కుమార్‌పై తూ.గో.(D) రాజానగరం పోలీసులు BNS సెక్ష‌న్లు 196, 197 కింద FIR న‌మోదు చేశారు. ప్రవీణ్‌ను చంపి పడేశారని, పోలీసులు కేసును పక్కదోవ పట్టిస్తున్నారని ఇటీవల ఆయన ఆరోపించారు. దీంతో విచారణకు వచ్చి ఆధారాలు సమర్పించాలని పోలీసులు నోటీసులిచ్చారు. విచారణకు హాజరు కాకపోగా, మళ్లీ అదేస్థాయిలో వ్యాఖ్యలు చేయడంతో తాజాగా కేసు నమోదు చేశారు.

News April 5, 2025

పెద్దపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలి

image

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకుడు అల్జాపూర్ శ్రీనివాస్ తెలిపారు. శనివారం పెద్దపల్లిలో జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి అధ్యక్షతన జిల్లాస్థాయి పదాధికారుల సమావేశం నిర్వహించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News April 5, 2025

కాళ్ల: బాబూ జగ్జీవన్ రామ్‌కు నివాళులర్పించిన కలెక్టర్

image

కాళ్ల మండలం వేంపాడు గ్రామంలో భారతదేశ తొలి ఉపప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని శనివారం కలెక్టర్ సి.నాగరాణి నిర్వహించారు. గ్రామంలోని ఆయన విగ్రహానికి గ్రామ సర్పంచ్‌తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, సమాజంలో అణగారిన ప్రజల కోసం కృషి చేసిన మహనీయుడని ఆయన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!