News March 22, 2025

NGKL: ఆ పథకం దరఖాస్తుకు ఈనెల 31 లాస్ట్!

image

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం 2025 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈనెల 31 చివరి తేదీ జిల్లా అధికారి షాబుద్దీన్ తెలిపారు. 21-24 వయసు, పదోతరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమా, బ్యాచిలర్ డిగ్రీ పూర్తయి ఉన్న వారు అర్హులు. నెలకు రూ.5000 చొప్పున ఏడాది పాటు అభ్యర్థుల ఖాతాలో నేరుగా జమ చేస్తారని తెలిపారు.

Similar News

News March 24, 2025

వనపర్తి: ‘ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మాలలకు తీరని అన్యాయం’

image

రాష్ట్రంలో గత 20 సంవత్సరాల నుంచి మాలలకు సంక్షేమ పథకాల్లో, కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్‌లో తీరని అన్యాయం జరిగిందని ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు మాదారి భోజరాజు అన్నారు. మాలలకు ప్రతి సంక్షేమ పథకంలో అవకాశం కల్పించాలని కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభికు వినతి పత్రం అందించారు. మద్దిలేటి వెంకటేశ్, కురుమూర్తి, కరుణాకర్ పాల్గొన్నారు.

News March 24, 2025

సింహాచలం అప్పన్న పెండ్లిరాట ఎప్పుడంటే?

image

సింహాచలం అప్పన్న స్వామివారి వార్షిక కళ్యాణం చైత్ర శుద్ధ ఏకాదశి అనగా వచ్చేనెల 8వ తేదీన నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన పెండ్లిరాట మహోత్సవాన్ని ఉగాది పర్వదినాన జనపనున్నారు. ఈనెల 30వ తేదీన సాయంత్రం సుముహూర్త సమయంలో పెండ్లిరాటను వేస్తారు. మండపంలో మధ్యాహ్నం నూతన పంచాంగ శ్రవణం అయిన తర్వాత ఈ పెండ్లిరాట మహోత్సవాన్ని నిర్వహిస్తారు.

News March 24, 2025

క్రికెటర్ తమీమ్ ఇక్బాల్‌కు గుండెపోటు

image

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌కు గుండెపోటు వచ్చింది. ఢాకా ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఇవాళ మ్యాచ్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి ఈసీజీ, తదితర స్కానింగ్స్ చేయించారు. ప్రస్తుతం తమీమ్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

error: Content is protected !!