News March 9, 2025

NGKL: ఆ మృతదేహం గురు ప్రీత్ సింగ్‌దే: బైద్య

image

SLBC టన్నెల్‌లో నుంచి వెలికితీసిన మృతదేహం రాబిన్స్ కంపెనీకి చెందిన గురుప్రీత్‌సింగ్‌దే అని సింగరేణి జనరల్ మేనేజర్ బైద్య తెలిపారు. కాంక్రీట్‌లో కూరుకుపోయిన మృతదేహం ఒక చేయి బయటకు రావటంతో ఆ ప్రాంతంలో తీవ్రంగా శ్రమించిన రెస్క్యూ సిబ్బంది మృతదేహాన్ని వెలికితీసినట్లు ఆయన వివరించారు. 

Similar News

News March 10, 2025

కారును ఢీకొట్టిన ట్రక్కు.. ఏడుగురు మృతి

image

మధ్యప్రదేశ్‌లోని ఉప్ని సమీపంలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున బొలెరోను వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. 14 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను రేవా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బల్కర్ సిద్ధి నుంచి బహ్రీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 10, 2025

మోడల్ స్కూల్స్ ప్రవేశాలు.. 20 వరకు అవకాశం

image

సిద్దిపేట జిల్లాలోని మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈనెల 20 వరకు పొడిగించారు. 6 నుంచి10వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని గజ్వేల్ మండలం ముత్రాజ్పల్లి మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపల్ డా. జె.వన్నెస్స తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు మీసేవ, ఇంటర్నెట్ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News March 10, 2025

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. కోనసీమ కుర్రాడు మృతి

image

పి.గన్నవరం మండలం జొన్నల్లంక చెందిన సందాడి సాయి వెంకటకృష్ణ (20) హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. బైక్‌పై వస్తుండగా శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగిందని కుటుంబీకులు తెలిపారు. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన మణికంఠ లక్ష్మీసాయి తీవ్రంగా గాయపడ్డాడు. ఇటీవల ఈ యువకులు ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

error: Content is protected !!