News April 24, 2025
NGKL: ఇంటర్ విద్యార్థి సూసైడ్ !

తల్లిదండ్రులు మందలించారని ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన NGKL జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. తెల్కపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మార్కులు ముఖ్యం కాదని విద్యార్థులకు తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News April 24, 2025
నేడు విశాఖ రానున్న పవన్ కళ్యాణ్

ఉగ్రవాద దాడిలో మృతి చెందిన చంద్రమౌళికు నివాళులర్పించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు విశాఖ రానున్నారు. తిరుపతి నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్‌కు సాయంత్రం 6.15కి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన పాండురంగపురం వెళ్లి చంద్రమౌళికి నివాళి అర్పిస్తారు. రాత్రికి విశాఖలోనే బస చేసి, శుక్రవారం ఉదయం 9.15 గంటలకు విమానంలో రాజమండ్రికి బయలుదేరుతారు.
News April 24, 2025
ఇంగ్లిష్‌లో మోదీ హెచ్చరికలు.. ఎందుకంటే..

PM మోదీ సాధారణంగా హిందీలోనే ప్రసంగిస్తుంటారు. కానీ ఈరోజు బిహార్‌లో మాత్రం ఇంగ్లిష్‌లో హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్థాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదంపై భారత్ చేయనున్న పోరాటం గురించి ప్రపంచానికి తెలిపేందుకే ఆయన ఇంగ్లిష్‌లో మాట్లాడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ‘బిహార్ గడ్డపై నిల్చుని ప్రపంచానికి చెబుతున్నా. ప్రతి ఉగ్రవాదిని పట్టుకుంటాం. భూమి అంచులకు వెళ్లినా వదిలే ప్రసక్తి లేదు’ అని PM అన్నారు.
News April 24, 2025
ఉత్తమ అవార్డు అందుకున్న అనంతపురం కలెక్టర్

స్వచ్ఛ ఆంధ్ర (గ్రామీణ) కార్యక్రమాల అమలులో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డును అనంతపురం జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ అందుకున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవార్డును అందజేశారు. గత ప్రభుత్వం పంచాయతీ నిధులన్నీ నిర్వీర్యం చేసిందని పవన్ విమర్శించారు. తాను ఇష్టంతో పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నానని చెప్పారు. కలెక్టర్‌ను అభినందించారు.