News March 21, 2024
NGKL: కన్న కొడుకును హత్య చేసిన తల్లి

ఓ తల్లి కొడుకుని హత్య చేసిన ఘటన బిజినపల్లి మండలం అల్లిపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కొడుకు హరీశ్(11)ను గురువారం ఇంట్లో భర్త లేని సమయంలో రోకలి బండతో కొట్టి చంపేసింది. తర్వాత బుట్టలో చుట్టి, నీటి తొట్టిలో పడేసి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 10, 2025
MBNR: బెట్టింగ్‌కు యువత బలి కావద్దు: ఎస్పీ

మహబూబ్నగర్ జిల్లాలో ఎవరైనా క్రికెట్, ఇతర బెట్టింగ్‌లకు పాల్పడిన ప్రోత్సహించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ డి.జానకి హెచ్చరించారు. ఇటీవల సులభంగా డబ్బు సంపాదించాలని ఆలోచనతో యువత అధికంగా క్రికెట్ బెట్టింగ్ మోజులోపడి వారి బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా, మోసగాళ్ల మోసపూరితమైన ప్రకటనలు, సందేశాలకు యువత ఆకర్షితులై మోసపోతున్నారు. 100 డయల్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.
News April 9, 2025
GREAT: ఇంగ్లాండ్ క్రికెట్ రెండో కౌంటీకి పాలమూరు బిడ్డ ❤

మహబూబ్‌నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్(MDCA) కృషితో ఉమ్మడి పాలమూరు జిల్లా మరికల్(M) వెంకటాపురంకి చెందిన జి.గణేశ్ ఇంగ్లాండ్ క్రికెట్ రెండో కౌంటీకి ఎంపికయ్యాడు. ఆరేళ్లపాటు ఒప్పందం కుదరడంతో ఐదు సిరీస్‌లలో 20 మ్యాచ్‌లు ఆడనున్నారు. ఈ సందర్భంగా గణేశ్ మాట్లాడుతూ.. ఇంగ్లాండ్ 2వ కౌంటీలకు ఎంపిక అవ్వడం సంతోషంగా ఉందని, భారత జట్టుకు ఆడడం తన లక్ష్యమన్నారు.
News April 9, 2025
వనపర్తి: చికిత్స పొందుతూ యువకుడి మృతి

చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతిచెందిన ఘటన మదనాపురం మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. అజ్జకొల్లుకి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు బాలకృష్ణ అనారోగ్యం కారణంగా ఏడాది నుంచి పనికి వెళ్లట్లేదు. దీంతో తల్లి లక్ష్మి ఆ పనికి వెళ్లేది. ఆ జీతం యువకుడి అకౌంట్లో పడేవి. తల్లి డబ్బులడగగా ఇవ్వకపోవటంతో అతడిపై గొడ్డలితో దాడి చేసింది. గాయపడిని యువకుడు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.