News March 10, 2025

NGKL: గురు ప్రీత్ సింగ్ కుటుంబ నేపథ్యం ఇదే..!

image

SLBC టన్నెల్ ప్రమాదంలో మృతి చెంది 16 రోజులకు మృతదేహంగా బయటపడిన గురు ప్రీత్ సింగ్(40) కుటుంబ నేపథ్యం ఇదే. వీరిది పంజాబ్‌లోని చీమ కలన్ గ్రామంలో 1985లో జన్మించారు. తండ్రి విర్స సింగ్, ఎరెక్టర్ ఆపరేటర్‌గా పనిచేసేవారు. అమెరికాకు చెందిన రాబిన్స్ కంపెనీలో 2022లో రెగ్యులర్ ఉద్యోగిగా చేరారు. భార్య రాజ్విందర్ కౌర్ ఉన్నారు. ఆయన మృతదేహం బయటకు తేవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగారు.

Similar News

News March 10, 2025

చంద్రయ్య హత్య కేసు CIDకి అప్పగింత

image

AP: పల్నాడుకు చెందిన TDP కార్యకర్త తోట చంద్రయ్య హత్య కేసును CIDకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేసు దస్త్రాన్ని వెంటనే పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. 2022లో వెల్దుర్తి (M) గుండ్లపాడులో ప్రత్యర్థులు చంద్రయ్యను గొంతు కోసి చంపారు. హత్యకు ముందు జై జగన్ అనాలని నిందితులు చంద్రయ్యను బెదిరించారనే ఆరోపణలున్నాయి. కేసు రీఓపెన్ చేయాలని తొలుత భావించిన ప్రభుత్వం తాజాగా CIDకి అప్పగించింది.

News March 10, 2025

ఏలూరు: వారం వ్యవధిలో రెండు ప్రమాదాలు

image

ఏలూరు జిల్లాలో వారం రోజుల వ్యవధిలో రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలకు గురయ్యారు. వైజాగ్, హైదరాబాద్, చెన్నై తదితర సర్వీసులకు ఏలూరు సెంటర్ పాయింట్‌గా ఉంది. సుదూర ప్రాంతాలకు ట్రావెల్ చేసే ఈ బస్సుల్లో డ్రైవర్లు ఒక్కరే ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏకధాటిగా గంటల తరబడి డ్రైవింగ్ చేయడం, నిద్రలేమి కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

News March 10, 2025

గన్నవరం: వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

image

విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో వంశీ బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. ప్రభుత్వ తరఫు న్యాయవాది సత్యవర్ధన్ కౌంటర్ దాఖలుకు రెండు రోజులు సమయం కోరారు. దీంతో విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ఏ71గా వల్లభనేని వంశీ ఉన్నారు. ఇటీవల నియోజకవర్గ వ్యాప్తంగా ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. 

error: Content is protected !!