News February 7, 2025

NGKL: చెరువులో పడి మహిళ మృతి

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలోని శ్రీరంగాపురం చెరువులో మునిగి మహిళ మృతి చెందిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. దాదాపు 35 ఏళ్ల వయసున్న మహిళ చెరువులో మునిగి చనిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చనిపోయిన మహిళకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 7, 2025

జనగామ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు

image

తమిళనాడులో ఘనంగా నిర్వహించే అరుణాచల గిరి ప్రదర్శన దర్శనానికి జనగామ డిపో నుంచి ప్రత్యేక బస్సును నడుపుతున్నట్లు జనగామ డిపో మేనేజర్ స్వాతి ప్రకటనలో తెలిపారు. పెద్దలకు రూ.4 వేలు, పిల్లలకు రూ.2,500 టికెట్ ధరలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ నెల 10వ తేదీన బయలుదేరి 13వ తేదీకి తిరిగి జనగామకు చేరుకుంటుందన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News February 7, 2025

ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ఆందోళన

image

ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ఆందోళన చేసిన ఘటన పెనుబల్లి మండలంలో చోటుచేసుకుంది. మండాలపాడుకి చెందిన గోపీచంద్‌ తాను 7ఏళ్లుగా ప్రేమించుకున్నామని.. కొద్ది రోజుల క్రితం తనకు వేరే వ్యక్తి వివాహమైందని బాధితురాలు తెలిపింది. భర్తను వదిలేసి తన వద్దకు రావాలని గోపిచంద్ వేధించడంతో భర్తకు విడాకులు ఇచ్చానట్లు వెల్లడించింది. తీరా వచ్చిన తరువాత గోపిచంద్ ముఖం చాటేస్తున్నాడని అవేదన వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టింది

News February 7, 2025

‘పాలమూరు-రంగారెడ్డి’కి జాతీయ హోదా ఇవ్వలేం: కేంద్రం

image

TG: పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పింది. లోక్‌సభలో కాంగ్రెస్ MP బలరాం నాయక్ అడిగిన ప్రశ్నకు జలశక్తి సహాయమంత్రి రాజ్ భూషణ్ చౌదరి పైవిధంగా సమాధానమిచ్చారు. టెక్నికల్ అంశాలు, న్యాయపరమైన చిక్కులు అడ్డొస్తున్నాయన్నారు. AP, TGలో ఏ ఒక్క ఎత్తిపోతల పథకానికి హోదా ఇవ్వలేదని గుర్తుచేశారు. దీంతో విభజన చట్టం హామీని కేంద్రం విస్మరించిందని INC మండిపడింది.

error: Content is protected !!