News April 21, 2025

NGKL: జర్నలిస్ట్‌లు గౌరవం కాపాడుకోవాలి: ఛైర్మన్

image

జర్నలిస్టులు క్రమశిక్షణతో మెలుగుతూ తగిన గౌరవం కాపాడుకోవాలని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి సూచించారు. ఆదివారం సోమశిలలో జరిగిన TUWJ(IJU) రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి వెళ్తున్న ఆయన NGKLలో మాట్లాడారు. మారిన కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు వృత్తిపరమైన శిక్షణలో మెలుకువలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు.

Similar News

News April 21, 2025

సిద్దిపేట: ప్రజావాణికి 44 దరఖాస్తులు

image

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం ఫిర్యాదుదారుల నుంచి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మొత్తం 44 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

News April 21, 2025

BREAKING: గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల

image

AP: గ్రూప్‌-1 మెయిన్స్ రాత పరీక్షకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. మే 3 నుంచి 9 వరకు 4 జిల్లా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. అన్ని పేపర్లకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఈరోజు నుంచే హాల్ టికెట్లను https://psc.ap.gov.in వెబ్‌సైట్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

News April 21, 2025

ప్రజల ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి: BHPL ఎస్పీ

image

ప్రజల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, సామాన్యులు నిర్భయంగా పోలీస్‌స్టేషన్లకు వచ్చి ఫిర్యాదులు అందజేయాలని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా దివాస్‌లో భాగంగా 18 మంది బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబధిత అధికారులను ఆదేశించారు.

error: Content is protected !!