News March 9, 2025

NGKL: జాతరకు తీసుకెళ్లలేదని ఆత్మహత్య.!

image

జాతరకు తీసుకెళ్లడం లేదని ఓ చిన్నారి మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన NGKL జిల్లాలో జరిగింది. 9ఏళ్ల బాలుడు చిన్నప్పటి నుంచి అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటున్నాడు. వెల్దండ మండలంలో ఉన్న గుండాల శ్రీఅంబాల రామలింగేశ్వర స్వామి జాతరకు తీసుకెళ్లాలని పట్టుబట్టాడు. వారు వద్దనడంతో ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Similar News

News December 16, 2025

MBNR: ఓటు హక్కును వినియోగించుకోండి- ఎస్పీ

image

ప్రతి ఓటరు ఎలాంటి భయభ్రాంతులు లేకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి పిలుపునిచ్చారు. పలు గ్రామాల్లో పర్యటించిన అనంతరం మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఏవైనా సమస్యలు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పికెటింగ్, మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్సులు ఏర్పాటు చేశామన్నారు.

News December 16, 2025

MBNR: ఫేస్-3..సిబ్బందికి ఎస్పీ డి.జానకి సమగ్ర బ్రీఫింగ్

image

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా బుధవారం జరగనున్న గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం జడ్చర్ల మండల కేంద్రంలో BRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఎన్నికల బందోబస్తు విధులకు హాజరైన పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ డి.జానకి సమగ్ర బ్రీఫింగ్ నిర్వహించారు.

News December 16, 2025

MBNR: 145 గ్రామాలు, 212 పోలింగ్ కేంద్రాల్లో భారీ బందోబస్తు: ఎస్పీ

image

మహబూబ్ నగర్ జిల్లా మొత్తం మూడో విడత సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో 145 గ్రామాల్లో 212 పోలింగ్ కేంద్రాలు, 1254 పోలింగ్ స్టేషన్లు ఉండగా, 44 సమస్యాత్మక గ్రామాల్లో 52 పోలింగ్ కేంద్రంలో 394 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని ఎస్పీ డి.జానకి వివరించారు. భద్రతా చర్యల్లో భాగంగా 44 రూట్ మొబైల్స్, 16 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ (FST), 5 స్ట్రైకింగ్ ఫోర్సులు, 5 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు మోహరించినట్లు తెలిపారు.