News November 8, 2024

NGKL: దారుణం.. తెల్లవారుజామునే హత్య

image

పొలం వద్ద రాత్రి కాపలా కాస్తున్నయువకుడని గుర్తుతెలియని దుండగలు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కలకలంరేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. వెల్దండ మండలం ఎంజీకాలనీ తండాకు చెందిన రాత్లావత్ రాజు(30) నిన్న రాత్రి పొలం వద్ద కాపలాకు వెళ్లాడు. కాగా.. ఈ తెల్లవారు జామున గుర్తుతెలియని వ్యక్తులు రాజుపై దాడి చేసి హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేపట్టారు.

Similar News

News November 8, 2024

MBNR: ఉపాధ్యాయురాలు స్కెచ్.. ఏసీబీకి చిక్కిన DEO

image

మహబూబ్‌నగర్ ఇన్‌ఛార్జ్ డీఈఓ రవీందర్ ఏసీబీకి చిక్కడం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పదోన్నతుల్లో ఓ ఉపాధ్యాయురాలుకు దక్కాల్సిన ప్రమోషన్ మరొక ఉపాధ్యాయురాలకు దక్కడంతో ఆమె ఎన్నోసార్లు డీఈఓ రవీందర్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం దక్కలేదు. కోర్టుకు వెళ్లినప్పటికీ లంచం డిమాండ్ చేయడంతో ACBకి ఆశ్రయించారు. ఈ క్రమంలో DEOను హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ తెలిపారు.

News November 8, 2024

నేడు కురుమూర్తి స్వామి ఉద్దాల మహోత్సవం

image

పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు ఉద్దాల కార్యక్రమం నిర్వహించనున్నారు. స్వామివారి పాదరక్షలను ఊరేగించడాన్నే ఉద్దాల ఉత్సవమంటారు. దేవస్థానానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న వడ్డెమాన్ నుంచి ఉత్సవం ప్రారంభం కానుంది. ఉద్దాల ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

News November 8, 2024

అవినీతిలో ఉమ్మడి పాలమూరు జిల్లా టాప్!

image

రాష్ట్రంలోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అవినీతిలో అగ్రస్థానంలో ఉంది. గతంలో ఎప్పుడు లేని విధంగా అవినీతి కేసులు నమోదవుతున్నాయి. రెవెన్యూ, విద్యుత్, పోలీసు పలు శాఖలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో రెడ్ హ్యాండెడ్‌గా 14 మందిని పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన వారిని ఏసీబీ అధికారులు జైలుకు పంపిస్తున్నా.. ప్రభుత్వ అధికారులలో తీరు మారడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.